Wednesday, 29 July 2026 06:20:29 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

బాధ్యతలు స్వీకరించిన మంత్రి వాసంశెట్టి సుభాష్

Date : 20 June 2024 10:40 PM

Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / అమరావతి : రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్స్ మరియు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్ బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యత చేపట్టేందుకు రాష్ట్ర సచివాలయానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు వేద పండితులు పూర్ణకుంభం తోను, అధికారులు పుష్ప గుచ్చాలను అందజేస్తూ ఘనంగా స్వాగతం పలికారు. పండితుల వేద మంత్రోచ్ఛారణ ల మధ్య ఆ భగవంతునికి షోడశోపచారా పూజ నిర్వహించిన తదుపరి తమ సీట్లో ఆసీనులు అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో అమల్లోవున్న వైయస్సార్ భీమా పథకానికి పేరు మారుస్తూ తొలి ఫైల్ పై సంతకం చేశారు. వైయస్సార్ బీమా పథకాన్ని చంద్రన్న బీమా పథకంగా పేరు మారుస్తూ తొలి సంతకం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం విషయంలో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నారు. నవరత్నాల పథకాలు పేరుతో కార్మికుల సంక్షేమానికి సంబంధించిన 13 పథకాల అమలును నిలుపుదల చేసిందన్నారు. కార్మిక శాఖకు వచ్చిన రూ.3,000 కోట్ల సెస్ పూర్తిగా పక్కదారి పట్టించడం జరిగిందన్నారు. కార్మిక భీమా పథకం కింద గతంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు హయాంలో రూ.2.55 కోట్ల భీమా సొమ్మును చెల్లిస్తే, గత ప్రభుత్వ హయాంలో కేవలం రూ.1.25 కోట్లను మాత్రమే చెల్లించడం జరిగిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి మరియు విజయవాడలలో వున్న ఈ ఎస్ ఐ ఆసుపత్రులను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, 238 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నా భర్తీ చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై కూడా పూర్తిగా గత ప్రభుత్వం అశ్రద్ధ వహించిందన్నారు. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు తమ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ కార్యదర్శి హరిజవహర్లాల్, కమిషనర్ శేషగిరి బాబు, ఫ్యాక్టరీల డైరెక్టర్ చంద్రశేఖర్ వర్మ, బాయిలర్స్ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ ఆంజనేయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: