Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా గురువారం ఉదయం దర్శించుకున్నారు. టిటిడి జె ఈ ఓ వీరబ్రహ్మం దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న నారా చంద్రబాబు నాయుడుకు అధికారులు, ఆలయ అర్చకులు వేదమంత్రోచారణ నడుమ ఘనంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి ముందుగా ధ్వజస్తంభంకు మొక్కులు చెల్లించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వాద మండపం నందు ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు ముఖ్యమంత్రి దంపతులకు అందజేశారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వెలుపల ముఖ్యమంత్రిని చూడడానికి అశేషమైన ప్రజలు ఒక్కసారిగా సీఎం అని పిలవగా వెంటనే స్పందించి నేరుగా ప్రజలకు అభివాదం చేసారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్, తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, టి టి డి సివిఎస్వో నరసింహ కిషోర్, ఎమ్మెల్యేలు తిరుపతి, శ్రీకాళహస్తి, శాసన సభ్యులు, ఆరణి శ్రీనివాసులు, బొజ్జల సుధీర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
Admin
Telugu Rekha Media