Thursday, 09 April 2026 05:35:08 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

నారా చంద్రబాబు నాయుడు అనే నేను...

Date : 12 June 2024 03:31 PM

Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : విజయవాడ ( తెలుగు రేఖ న్యూస్): ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్‌ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. నాలుగోసారి ఏపీ సీఎంగా ప్రమాణం చేసిన చంద్రబాబు రికార్డు సృష్టించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో, జేపీ నడ్డా, ఇతర రాజకీయ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అతిరథ మహారథులు కదలివచ్చిన వేళ ప్రమాణస్వీకారం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.భిమానులు, కార్యకర్తల కేరింతలు, హోరెత్తిన చప్పట్ల మధ్య.. 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు నారా చంద్రబాబు నాయుడు.. “నారా చంద్రబాబు నాయుడు అనే నేను..” అంటూ ఆయన ప్రమాణం మొదలెట్టగానే సభా ప్రాంగణమంతా జయజయధ్వానాలతో హోరెత్తిపోయింది. కేసరపల్లి IT పార్క్‌లో ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు ఎన్డీయే నేతలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడుకి ప్రధాని మోదీ పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పారు. ఈ సమయంలో చంద్రబాబులో ఉద్వేగం చాలా చాలా స్పష్టంగా కనిపించింది. బాబు వెన్నుతడుతూ మోదీ ప్రశంసాపూర్వకంగా చెప్పిన మాటలకు.. ఆయన కళ్లు చెమర్చాయి. ఆనందాన్ని ఆపుకోలేకపోయారు. మోదీకి ధన్యవాదాలు చెప్పి చంద్రబాబు తిరిగి తన స్థానానాకి వెళ్లే వరకూ వేదికపై ఓ అపూర్వ సన్నివేశం కనిపించింది.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :