Saturday, 13 June 2026 06:39:59 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

టీటీడీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విజిలెన్స్ కు ఫిర్యాదు...

Date : 03 July 2024 08:55 PM

Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : శ్రీవారి ట్రస్ట్ నిధులు ఎక్కడికి మళ్లించారని, భక్తులు ఎంత డిపాజిట్ చేశారని, అమోత్తం ఏ సంస్థకు, ఆలయాల నిర్మాణానికి ఇచ్చారని, వాటిపై శ్రీవారి భక్తులకు అనుమానాలు వున్నాయని, తక్షణమే ధర్యాప్తు చేపట్టి నిజా నిజాలు ప్రజలకు తెలియజేయాలని తిరుపతి స్టేట్ విజిలెన్స్ కార్యాలయం నందు కిరణ్ రాయల్ జనసేన నేతలతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీవాణి ట్రస్ట్ నిధులలో అవకతవకలు జరిగాయని గతంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈ విషయంపై మాట్లాడారని, అవన్నీ కూడా వాస్తవమేనని, గత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 5 ఏళ్లలో తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్, దర్శనాల పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు చేశారని, వాటిమీద పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని విజిలెన్స్ అధికారులను కోరామన్నారు. అలాగే గత ప్రభుత్వంలో మంత్రులకు ఇచ్చిన సేవా టికెట్లు, విఐపి బ్రేక్ దర్శన టికెట్లు అన్నింటిపై కూడా విచారించి, దర్యాప్తు చేయాలన్నారు. గత 5 సం|| లలో 2019 జూన్ నుంచి 2024 మే వరకు ఇచ్చిన టికెట్లలో దాదాపు కొన్నివేల టికెట్ల మీద అక్రమంగా వ్యాపారాలు జరిగాయన్నారు, దర్శనాల పేరుతో లాబీయింగ్ చేసుకొని దోచుకున్నారని కిరణ్ రాయల్ స్పష్టం చేశారు. వీటన్నిటిపై విచారణ చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో.. జనసేన నేతలు సుభాషిని, హేమ కుమార్, చందన, ప్రసాద్, దుర్గ, వినోద్, కిషోర్, మనోజ్, షరీఫ్, రాజేంద్ర, ఆది, భాను, లోకేష్, ప్రసాద్,మురళి తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :