Wednesday, 15 April 2026 03:04:25 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

మండల వ్యాప్తంగా ఘనంగా పింఛన్ల పండుగ కార్యక్రమం...

-- ఉదయాన్నే లబ్ధిదారులకు 7,000 అందజేసిన సచివాలయ ఉద్యోగులు, టిడిపి నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేసిన పింఛ

Date : 01 July 2024 04:14 PM

Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / అమరావతి : తుగ్గలి మండల వ్యాప్తంగా జులై 1 సోమవారం రోజున ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగను తెలుగుదేశం పార్టీ నాయకులు,ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఎన్నికలలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పింఛన్ లబ్ధిదారులు పాలాభిషేకాన్ని నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు. గత మూడు నెలల పింఛన్ పెంపు 3 వేలతో పాటుగా,జులై నెల పించను 4 వేలతో కలిపి మొత్తం 7వేల రూపాయలను ఉదయాన్నే గ్రామ సచివాలయ ఉద్యోగులు,గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. పింఛన్లను అందుకున్న అవ్వ తాతలు, వికలాంగులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసి పాలాభిషేకాలను నిర్వహించారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లను 1000 పెంచి పెద్దకొడుకుల మమ్మల్ని ఆదరించారని పింఛన్ లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. మండల కేంద్రమైన తుగ్గలిలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహన కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర,మాజీ వైస్ ఎంపీపీ భాస్కర్, వీఆర్వో రహిమాన్,సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ పులిశేఖర్ లు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెంచిన ఎన్టీఆర్ పింఛన్లను పంపిణీ చేశారు.అదేవిధంగా ఉప్పర్లపల్లె గ్రామం నందు సీఎం డిప్యూటీ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాన్ని నిర్వహించి సచివాల ఉద్యోగుల తో పాటుగా,గ్రామ టిడిపి నాయకులు అప్పా వేణు,నీలా ప్రసాద్,నీలా మనోహర్, అప్పా వెంకటేష్,అప్పా జగన్, ఈశ్వరయ్య,ఈడిగ శ్రీనివాసులు, సుంకప్ప,హరిజన కంబగిరి,శ్రీరాములు, ఓబులేసు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు.అదేవిధంగా చెన్నంపల్లి గ్రామం నందు సర్పంచ్ రంగమ్మ, మాజీ జడ్పీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు, సర్పంచ్ సలహాదారులు వెంకటపతి,మా భాష,షాషావలి,రాజేంద్ర గౌడ్ లు లవ్ యు దారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు.అదేవిధంగా బొందిమడుగుల గ్రామం నందు పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం బాబు ఆదేశాల మేరకు సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకాన్ని నిర్వహించి పంచాయతీ కార్యదర్శి రామాంజనేయులు, సర్పంచ్ గౌరవ సలహాదారుడు ప్రతాప్ యాదవ్, మాజీ సర్పంచ్ వెంకట రాముడు, మోహన్ వీరేంద్ర హుస్సేన్ నాగేష్ సుంకన్న మరియు సచివాలయ ఉద్యోగులు ఉషారాణి తదితరుల ఆధ్వర్యంలో గ్రామంలో పింఛన్ లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు.అదేవిధంగా జొన్నగిరి గ్రామం నందు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ ఓబులేసు,బాలన్న,మాజీ ఎంపీపీ గురుస్వామి, మిద్దె వెంకటేశ్వర్లు,మిద్దె రవి,సంఘాల కృష్ణ,ఈఓఆర్డి గోపాల్ తదితరులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి పింఛన్లను పంపిణీ చేశారు.అదేవిధంగా నల్లగొండ గ్రామం నందు టిడిపి నాయకులు రవి,సచివాలయ ఉద్యోగి శంకర్ ల ఆధ్వర్యంలో గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. మండల వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు,ప్రజా ప్రతినిధులు పాల్గొని సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :