Wednesday, 15 April 2026 03:46:50 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

స్కందునికి కావళ్ల సమర్పణ...

Date : 29 July 2024 07:15 PM

Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : హరో.. హర నామస్మరణ లతో శ్రీకాళహస్తి మార్మోగింది ఆడికృత్తిక మహోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం విజ్ఞానగరిపై కొలువుదీరిన స్కందుని దర్శించుకునేందుకు వచ్చిన భక్తజన ప్రవాహంతో ఇక్కడి క్షేత్రంలో సందడి వాతావరణం నెలకొంది పసుపు వస్త్రాలను ధరించి భక్తిశ్రద్ధలతో తలనీలాలు సమర్పించి కావళ్లు పట్టుకొని శరవణభవుని నామస్మరణతో కావళ్ల మొక్కు సమర్పించుకున్నారు. సోమ, మంగళ వారాలు రెండు రోజులు కృత్తిక నక్షత్రం ఉండటంతో మధ్యాహ్నం నుంచి విజ్ఞానగిరి భక్తజన సంద్రంగా మారింది భక్తుల మధ్య తొక్కిసలాటలు లేకుండా క్యూలైన్లను పకడ్బందీగా ఏర్పాటు చేశారు నారద పుష్కరిణి లోను ఇలాంటి ప్రమాదాలు తలెత్తకుండా భద్రత ఏర్పాట్లు చేపట్టారు ఆడికృత్తిక సందర్భంగా విజ్ఞానగిరిపై కొలువుతీరిన కుమారస్వామికి విశేష పూజ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు అనంతరం చందన రూపుడై భక్తులకు దివ్యదర్శనం కల్పించారు.ఆడికృత్తిక సందర్భంగా ఇంద్ర విమానంపై శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామిని చతుర్మాడ వీధుల్లో ఊరేగించారు కార్యక్రమంలో ఆలయ ఇ.ఓ ఎన్ ఎస్ ఎన్ మూర్తి, ఏసీ మల్లికార్జున ప్రసాద్ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు ఉదయం నుంచి రాత్రి వరకు 70 వేల మంది వరకు భక్తులు దర్శనం చేసుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :