Wednesday, 15 April 2026 03:26:32 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ప్రజలపై భారం పడకుండా పనిచేస్తున్న ప్రభుత్వం...

- అభివృద్ధి సంక్షేమంపై దృష్టి సారించిన ఎమ్మెల్యే అఖిలప్రియ. -- అఖిలమ్మ తోనే ఆళ్లగడ్డ నియోజకవర్గం అభివృద్ధి సాధ్యం.

Date : 18 July 2024 07:04 PM

Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : నిత్యవసర వస్తువుల ధరల స్థిరీకరణ లక్ష్యంగాప్రజలపై భారం పడకుండా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం పని చేస్తుందని టిడిపి ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కోలేగుండ్ల నరసింహుడు అన్నారు. బుధవారం పట్టణంలోని ఎస్టీ సెల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆళ్లగడ్డ నియోజకవర్గం అభివృద్ధి ఎమ్మెల్యే శ్రీమతి భూమ అఖిలప్రియ తోనే సాధ్యమన్నారు. అభివృద్ధి సంక్షేమపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దృష్టి సారించారని తెలిపారు. పేద ప్రజలకు కందిపప్పు బియ్యం ధరలను తగ్గించి అమ్మాలనే ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదేశాలతో ఆళ్లగడ్డ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పౌర సరఫరాల శాఖ బియ్యం కందిబేళ్ల ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారన్నారు. కావున ప్రజలందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఉచిత ఇసుక విధానాన్ని తెచ్చిన ఘనత టిడిపికే దక్కుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకుంటూనే... ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్క హామీని టిడిపి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఆళ్లగడ్డ శాసనసభ్యులు శ్రీమతిభూమా అఖిలప్రియ నాయకత్వంలో ఆళ్లగడ్డ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు. వికలాంగులకు వయోవృద్ధులకు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ పెంచారని సంతోషం వ్యక్తం చేశారు. ఆగస్టు 15 తారీకు నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాల పథకాన్ని ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి కార్యకర్తలు కండ్రై శివకృష్ణ , రాము, జయరాముడు ,నాసారి కాశయ్య ,భనేటి సతీష్, పెనుబండి రమణమ్మ, కళింగిరి వివేక్ తదితరులు ఉన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :