Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / ఎన్.టి.ఆర్ జిల్లా : ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల మండలం పరిటాల క్వారీలో ప్రమాదం జరిగింది. ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందారు. క్వారీ పైనుంచి లూజు బోల్డర్స్ పెద్ద మొత్తంలో జారి డ్రిల్లింగ్ వేస్తున్న కార్మికులపై బోల్డర్స్ పడ్డాయి. పెద్ద పెద్ద రాళ్ల కింద ముగ్గురు కార్మికులు చిక్కుకపోయారు. మృతులు జి.కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామానికి చెందిన వారుగా తెలుస్తోంది.
Reporter
Telugu Rekha Media