Wednesday, 29 July 2026 04:47:22 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

వైసీపీ ప్రభుత్వం ఆర్థిక దోపిడీ వల్ల రాష్ట్రానికి తగ్గిన రూ. 76,795 కోట్ల ఆదాయం...

Date : 26 July 2024 10:25 PM

Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / అమరావతి : గత వైసీపీ ప్రభుత్వం అవలంభించిన ఆర్థిక దోపిడీ వల్ల రాష్ట్రానికి రూ. 76,795 కోట్ల ఆదాయం తగ్గిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేయడంతో పెట్టుబడులు తగ్గిపోయాయని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశంలో శుక్రవారం గత ప్రభుత్వ ఆర్థిక అవకతవలకపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019-24 మధ్య రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిందని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను సైతం మళ్లించారని దుయ్యబట్టారు. డ్వాక్రా మహిళల నిధులను కొట్టేశారు. పంచాయతీలకు వెళ్లాల్సిన నిధులను దారి మళ్లించారు. ప్రభుత్వ ఆస్తులను, విశాఖలో ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టారని విమర్శించారు.పోలవరం పూర్తయి ఉంటే ఏపీకి రూ. 45 వేల కోట్ల ఆదాయం వచ్చేదని వివరించారు. ఇసుక అక్రమాల ద్వారా రాష్ట్రానికి రూ. 7 వేల కోట్లు , గనుల దోపిడీ ద్వారా రాష్ట్రానికి రూ.9,750 కోట్ల మేర నష్టం జరిగిందని అన్నారు. రాజధాని అమరావతిని కొనసాగించి ఉంటే విశ్వనగరంగా అభివృద్ధి చెందేదని, రూ. 3లక్షల కోట్ల ఆస్తి , 7 లక్షల ఉద్యోగాలు వచ్చేవని బాబు పేర్కొన్నారు.ఏపీకి ఆదాయ వనరులు భారీగా తగ్గాయని, వృద్ధిరేటు 13.5 నుంచి 9. 5 శాతానికి పడిపోయిందని వెల్లడించారు. 2014-19 టీడీపీ హయాంలో రాష్ట్రాభివృద్ధి కోసం కొత్త పోర్టులు ప్రారంభించామని వివరించారు. ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉండడం కలిసి వచ్చే అంశమని అన్నారు. కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :