Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / అమరావతి : అమరావతి, విజయవాడ ( తెలుగు రేఖ న్యూస్): కోన్ని దృశ్యాలు అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటి దృశ్యం కోసం ప్రజలంతా ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి దృశ్యం చూసే రోజు వస్తుందని ఎవరూ ఊహించకపోవచ్చు. అందుకే అలాంటి ఘటనలను అనూహ్య సంఘటనలుగా చెప్పుకుంటాం. సరిగ్గా ఇలాంటి అరుదైన అద్భుత దృశ్యం ఆంధ్రప్రదేశ్‌లో ఆవిష్కృతమైంది. మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటన.. కార్యక్రమమం మొత్తంలో హైలెట్‌గా నిలిచిపోతుందని చెప్పుకోవచ్చు.ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు, కొత్త మంత్రులు కలిసి ఫోటో దిగారు. ఆ తరువాత సభా వేదికనుంచి మోదీ దిగిపోయే సమయంలో ప్రధాన వేదికకు పక్కన ఉన్న మరో వేదికపై అతిథులంతా కూర్చుని ఉన్నారు. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ చేయి పట్టుకుని అతిధులు ఉన్న వేదికపైకి మోదీ చేరుకుని. అక్కడ ఉన్న చిరంజీవి దగ్గరకు వెళ్లారు. ఓవైపు చిరంజీవి.. మరో వైపు పవన్ కళ్యాణ్.. ఉండగా మధ్యలో మోదీ నిల్చుకుని చేతులు పైకెత్తి అందరికీ అభివాదం చేశారు. ఈ దృశ్యం చూడగానే సభికులంతా మెగస్టార్.. పవర్ స్టార్ నినాదాలు చేశారు. అంతేకాదు మెగస్టార్ కుటుంబ సభ్యులంతా ఈ దృశ్యాన్ని చూసి ఎమోషనల్ అయ్యారు. చిరంజీవి పవన్ గడ్డం పట్టుకుని నవ్వుతూ పలకరించారు. దీనిని మెగస్టార్, పవర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే దృశ్యంగా చెప్పుకోవచ్చు.
Admin
Telugu Rekha Media