Saturday, 13 June 2026 06:37:00 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

5 ఏళ్ల తరువాత సిఎంను కలిశాం...

-- ఇకపై మీకు సచివాలయంలో చాలా పని ఉంటుంది అంటూ మీడియా ప్రతినిధులతో సిఎం వ్యాఖ్య..!

Date : 14 June 2024 08:32 PM

Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / అమరావతి : ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం 4.41 గంటలకు సచివాలయంలోని తన చాంబర్ లో బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల హామీలపై తొలి సంతకాలు పెట్టారు. అనంతరం ఇంటికి వెళుతున్న చంద్రబాబు నాయుడు సచివాలయం మొదటి బ్లాక్ వద్ద మీడియా ప్రతినిధులను చూసి కారు ఆపారు. కారు దిగి ముందుకు వచ్చి మీడియా ప్రతినిధులను స్వయంగా పలకరించారు. సీనియర్ రిపోర్టర్లను పేర్లతో పలకరించి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని ఆప్యాయంగా అడిగారు. 5 ఏళ్ల తరువాత తాము సిఎంను కలిశామని. స్వేచ్ఛగా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నామని మీడియా ప్రతినిధులు బదులిచ్చారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో ఉండే తాము గత 5 ఏళ్లుగా సిఎంను కనీసం కలవలేకపోయామని. పాలనా అంశాలపై కూడా మాట్లాడలేదని రిపోర్టర్లు అభిప్రాయపడ్డారు. సచివాలయంలో వార్తలు కవర్ చేసే తాము 5 ఏళ్ల తరువాత సిఎంను కలిశామని నవ్వుతూ అన్నారు. ఇక నుంచి మీకు చాలా పని ఉంటుంది అంటూ ముఖ్యమంత్రి వారితో అన్నారు. పాలనలో సమూల మార్పు ఉంటుందని. అన్ని చోట్లా మార్పు ఉండబోతుందని ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో వ్యాఖ్యానించారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన మీడియా ప్రతినిధులకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. మళ్లీ కలుద్దాం అంటూ ఉండవల్లి నివాసానికి వెళ్లారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :