Saturday, 13 June 2026 07:55:49 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

28న విద్యా సదస్సును జయప్రదం చేయండి...

- యూటీఎఫ్ పిలుపు.

Date : 26 July 2024 10:39 AM

Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / వైఎస్ఆర్ కడప/బద్వేలు : ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 28న ఆదివారం ఉదయం 10 గంటలకు జరగబోవు రాష్ట్రస్థాయి విద్యాసదస్సును జయప్రదం చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి రాజా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు కోరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యుటిఎఫ్ ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తికావస్తున్న సందర్భంగా రాష్ట్రమంతటా స్వర్ణోత్సవాలు జరుగుతున్నాయని ఈ స్వర్ణోత్సవాల్లో భాగంగా వివిధ జిల్లాలలో సమకాలీన అంశాలపై రాష్ట్రస్థాయి సదస్సులు నిర్వహించి ఉపాధ్యాయులను చైతన్య పరచడం జరుగుతున్నదని తెలిపారు 2024 మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని రాష్ట్ర పరిస్థితులను శ్వేత పత్రాల రూపంలో ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్నదని మరి శ్వేత పత్రాలలో వాస్తవ విషయాలు తెలియచేయటం జరుగుతున్నదని తెలిపారు ఇటీవల విడుదల చేసిన ఆర్థిక శ్వేత పత్రం కూడా ఇలాగే ఉందని గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అప్పులకుప్పగా మారిందని దీనికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలు కూడా కారణమని తెలిపారు ఈ నేపథ్యంలో దేశ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై అవగాహన కలిగించే నిమిత్తం ఈనెల 28వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల బాలాజీ నగర్ నందు రాష్ట్ర విద్యా సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఆర్థిక శ్వేత పత్రం వాస్తవాలు అన్న అంశంపై భక్తగా శ్రీ వి రాంభూపాల్ గారు అలాగే ప్రత్యామ్నాయ విద్యా విధానం అన్న అంశంపై యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కె ఎస్ ఎస్ ప్రసాద్ గారు వివరిస్తారని తెలిపారుజిల్లాలోని ఉద్యోగ ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విద్యా సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఏజాస్ అహ్మద్ ఆడిట్ కమిటీ కన్వీనర్ ప్రభాకర్ నాయకులు గోపీనాథ్ వీరనారాయణ తదితరులు పాల్గొన్నారు

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :