Thursday, 09 April 2026 05:36:43 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

అల్లర్ల కేసులో పలువురు అరెస్టు...

అదుపులో శాంతి భద్రతలు. -- జిల్లా ఎస్పి డా.బి.బాలస్వామి...

Date : 18 June 2024 06:11 PM

Telugu Rekha Media - తెలంగాణ / మెదక్ : మెదక్ పట్టణంలో ఇరు వర్గాల్లో జరిగిన గొడవలు అదుపులోకి వచ్చాయని గొడవలకు కారణమైన ఒక వర్గానికి చెందిన 16 మందిని మరో వర్గానికి చెందిన 11 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించామని జిల్లా ఎస్పి డా.బి.బాలస్వామి అన్నారు. రెండు వర్గాల మధ్య జరిగిన గొడవల కారణాంగా ఇతర జిల్లాల నుంచి పోలీస్ ఫోర్స్ తెప్పించి అంతా అదుపులోకి తెచ్చినట్టు తెలిపారు. సోషల్ మీడియా వేదిక అనగా వాట్సాప్, ట్విట్టర్,ఫేస్ బుక్ మొదలైన వాటి ద్వారా వచ్చే ఎలాంటి వదంతులను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ఎవరైనా ఉద్దేశ్యపూరకంగా సోషల్ మీడియాలో కానీ మరే ఇతర రకంగా గొడవలు పెట్టాలనుకుంటే వారిపై చట్ట పరమైన చర్యలు ఉంటాయని, సోషల్ మీడియా పై నిఘా నడుస్తున్నదని గొడవలకు కారణమైన ఎవరిని వదలమని హెచ్చరించారు. సోషల్ మీడియాలో విద్వేషకర, రెచ్చగొట్టే, తప్పుడు పోస్టులు పెట్టవద్దని విస్మరించి ఎవరైనా తప్పుడు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని జిల్లా పోలీసులు నిరంతరం గమనిస్తారని అలాంటి వారిపై చట్ట ప్రకారం కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా సామాజిక మాద్యమాలు అయిన వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం, టెలిగ్రామ్, యూట్యూబ్ లాంటి సామాజిక మాద్యమాలను వేదికగా చేసుకోని తప్పుడు, విద్వేషకర పోస్టులు చేసిన,షేర్ చేసినా తగిన చర్యలు తప్పవని గొడవలకు సంబంధించిన అన్ని వీడియోలు ఉన్నాయని, వాటి ఆధారంగా నిందితులను గుర్తించామని చెప్పారు. ఇట్టి గొడవలపై సమగ్ర విచారణ జరుగుతున్నదని గొడవలకు కారణమైన ఎవరిని విడిచిపెట్టేది లేదని ఎవరు కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని ఏమైనా అనుమానాలు ఉంటే సంబందిత అధికారులను సంప్రదించాలని ఈ సందర్బంగా సూచించారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :