Thursday, 30 July 2026 06:35:59 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

బెజ్జంకి పోలీస్ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ...

Date : 24 July 2024 11:33 PM

Telugu Rekha Media - తెలంగాణ / సిద్దిపేట/బెజ్జంకి : విజబుల్ పోలీసింగ్ పై దృష్టి సారించాలి పోలీస్ అధికారులు సిబ్బంది తరచుగా గ్రామాలను సందర్శించాలి. గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై నిఘా పటిష్టం చేసి సమూలంగా నిర్మూలించాలి. అధికారులు సిబ్బంది నిజాయితీగా విధులు నిర్వహించాలి విధి నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించరాదు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలు మరియు పోలీస్ స్టేషన్ రికార్డ్స్ సిడి ఫైల్స్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందితో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ... ప్రతి కేసులో పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని సూచించారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ వచ్చే ప్రతి దరఖాస్తుకు రిసిప్ట్ ఇవ్వాలని రిసెప్షన్ సూచించారు. అంకితభావంతో విధులు నిర్వహించాలని, అదే సమయంలో ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని సూచించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కంకణ బద్ధులై విధులు నిర్వహించాలని సూచించారు. సైబర్ నేరాల గురించి మరియు ప్రజలు ఎవ్వరూ సైబర్ నేరాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి రోజు ఉదయం సాయంత్రం విజబుల్ పోలీసింగ్ విధులు నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. విపిఓ విలేజ్ పోలీస్ ఆఫీసర్ బుక్స్ తనిఖీ చేశారు, గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మత్తుపదార్థాల వల్ల కలిగే పర్యవసానాల గురించి గురించి స్కూల్ లలో కాలేజీలలో గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గంజాయి డ్రగ్స్ ఇతర మత్తుపదార్థాలు అమ్మే వారిపై సేవించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని సూచించారు. గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలను ఉక్కు పాదంతో అణిచివేయాలని తెలిపారు. గ్రామాలలో మండల కేంద్రంలో అక్రమంగా బెల్టు షాపులు నిర్వహించే వారిపై నిఘా పెంచాలని తెలిపారు.ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూడాలని సూచించారు.పోలీస్ అధికారులు సిబ్బంది తరచుగా గ్రామాలను సందర్శించి ప్రజల యొక్క సాధక బాధకాలు తెలుసుకోవాలని సూచించారు.ప్రజల రక్షణకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలని సూచించారు.నూతన చట్టాల గురించి గ్రామాలలో మండల కేంద్రంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. మహిళల రక్షణకు పెద్దపీట వేయాలని సూచించారు.సిబ్బంది యొక్క సాధక బాధలు అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.ఆగస్టు 15 తర్వాత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని అధికారులు సిబ్బంది ప్రతి ఒక్కరూ మెడికల్ టెస్ట్లు చేయించుకోవాలని తెలిపారు.ళ్లు కాలేజీలు బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.గ్రామాలలో పట్టణాలలో పనిచేయని సీసీ కెమెరాలు గురించి సంబంధిత వ్యాపారులు ప్రజాప్రతినిధులతో కలసి నేను సైతం ద్వారా రిపేర్ చేయించాలి, మరియు కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. సీసీ కెమెరాల వల్ల కలిగే ఉపయోగాలు గురించి వ్యాపారస్తులకు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. విధినిర్వహణలో పోటీపడి విధులు నిర్వహించే వారికి ప్రతి నెల రివార్డులు అవార్డులు అందజేయడం జరుగుతుందన్నారు.రాష్ట్ర కేంద్రస్థాయిలో బెస్ట్ పోలీస్ స్టేషన్ ఎంపిక గురించి పోలీస్ అధికారులు సిబ్బంది సమిష్టిగా కృషిచేసి ఎంపికయ్యే విధంగా విధులు నిర్వహించాలని సూచించారు.చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సమూలంగా నిర్మూలించాలని తెలిపారు.పాత నేరస్తులైన కేడీలు డీసీలు సస్పెక్ట్ లను తరచుగా తనిఖీలు చేయాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలని తెలిపారు.పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలను మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేటట్లు చూసుకోవాలని తెలిపారుఈ కార్యక్రమంలో సిద్దిపేట ఏసీపి మధు, సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ కమలాకర్, ఐటీ సెల్ ఎస్ఐ నరేందర్, బెజ్జంకి ఎస్ఐ కృష్ణారెడ్డి, ఏఎస్ఐ శంకర్ రావు, హెడ్ కానిస్టేబుళ్లు ఎల్లయ్య, కనకయ్య, అంజయ్య, మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :