Saturday, 13 June 2026 06:56:26 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

చినుకు జాడేది...!

--మబ్బులే తప్ప వర్షం పడని వైనం. -- జూన్ లోనూ తప్పని ఒక్క పోత. -- ఎంతకి తగ్గని పగటి ఉష్ణోగ్రతలు

Date : 18 June 2024 03:55 PM

Telugu Rekha Media - తెలంగాణ / పెద్దపల్లి : గోదావరిఖని: వానకాలం వచ్చినా మబ్బులే తప్ప చినుకు జాడలేదు. ప్రస్తుతం పెద్దపెల్లి జిల్లాలో విభిన్న వాతావరణం నెలకొంది. అటు వ్యవసాయానికి అవసరమైన వర్షాలు కురువకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. అసలైన తొలకరి పలకరింపు కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. గతెడాది జూన్ లో ఒక మోస్తారుగా వర్షాలు పడ్డాయి, ఆరంభంలోనే వరుణుడు కొంత కరుణించడంతో రైతులు ఉత్సాహంగా ఖరీఫ్ సాగు పనులు చేపట్టారు. కానీ... ఈ ఏడాది వరుణుడి జాడ కనిపించడం లేదు. జూన్ మూర్ఖశిర కార్తి సగం కాలం గడిచిన నైరుతి రుతుపవనాల ప్రభావం ఎక్కడ కానరావడం లేదు. వర్షాలతో చల్లబడాల్సిన వాతావరణం భానుడి భగ భగలతో మండిపోతుంది. ఏప్రిల్, మే నెలల్లో సూర్య ప్రతాపంతో అల్లాడిన ప్రజలు... జూన్ లో వర్షాలతో కొంత సేద తేరొచ్చని ఆశించారు. కానీ అది నిరాశ అవుతుంది. దట్టమైన మబ్బులు పడుతున్నా. గాలి దుమారంతో కూడిన చిరుజల్లులే పడుతున్నాయి తప్ప ఇప్పటివరకు భారీ వర్షం నమోదైన దాఖలాలు లేవు. అయితే రోజురోజుకు ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతున్నాయి. మండే ఎండలకు ఊకపోత తోడవడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు పెరగడమే కాక రాత్రిపూట కూడా వాతావరణం వేడి గానే ఉంటుంది. జూన్ తొలి వారంలోనే వర్షాలు ప్రారంభమై, రెండో వారం నాటికి వాతావరణం పూర్తిగా చల్లబడాలి. కానీ ఇప్పటికీ సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉన్నాడు. జిల్లాలో మంగళవారం సుమారు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు గాలిలో తేమ 70% ఉండడంతో ప్రజలు ఊకపోతుతో అల్లాడిపోతున్నారు. మరో వారం రోజుల పాటు ఇవే ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణం శాఖ హెచ్చరించడంతో ఆందోళన చెంచుతున్నారు. మృగశిర కార్తెకు ముందు రెండు రోజులు మాత్రమే, ఉరుములు, మెరుపుతో కొంత ఆశలు రేకెత్తించాయి. అయితేఆరితలోనే గాలులు వేయడంతో మేఘాలు తేలిపోయాయి. ఆ తర్వాత రోజు ఇదే పరిస్థితులు నెలకొంటున్నాయి. విత్తుకునేందుకు మరి కొంత సమయం ఉన్నప్పటికీ సీజన్ ప్రారంభంలోనే కాలం కలిసి రాకపోవడంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :