Wednesday, 15 April 2026 03:04:11 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తాం...

-- పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.

Date : 25 July 2024 06:31 PM

Telugu Rekha Media - తెలంగాణ / పెద్దపల్లి/మంథని : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ముత్తారం మండలం ముత్తారం, లక్కారం గ్రామాలలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పోతారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను, పాఠశాలలోని టాయిలెట్లు, భోజన శాల, కిచెన్ ఏరియాను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలలోని తరగతి గదులను తనిఖీ చేసి ప్రాథమిక తరగతుల విద్యార్థుల కనీస విద్యా ప్రమాణాలను కలెక్టర్ పరీక్షించారు. విద్యార్థుల కనీస విద్యా ప్రమాణాలపై ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని, పిల్లలకు తప్పనిసరిగా చదవడం, రాయడం, బేసిక్ మ్యాథ్స్ రావాలని అన్నారు. లక్కారం గ్రామంలోని పాఠశాల ప్రహారి గోడ పాక్షికంగా దెబ్బతినడం గమనించిన కలెక్టర్ వెంటనే మరమ్మత్తులు చేయాలని అధికారులకు సూచించారు. పాఠశాల ప్రాంగణంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అన్నారు. పోతారం జడ్పిహెచ్ఎస్ పాఠశాల గ్రౌండ్ లెవెలింగ్ చేయాలని, కాంపౌండ్ వాల్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. ముత్తారం ఎంపిపిఎస్ పాఠశాల వద్ద కూలిపోయే దశలో నిరుపయోగంగా ఉన్న 3 తరగతి గదులను తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ తనీఖీలలో జిల్లా కలెక్టర్ వెంట డివిజనల్ పంచాయతీ అధికారి కే సతీష్, ముత్తారం ఎంపీడీవో జి.లలిత, మండల పంచాయతీ అధికారి .బి.వేణుమాధవ్, పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ఎం. వరలక్ష్మి, ఏపిఎం డి.పద్మ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :