Thursday, 30 July 2026 04:48:37 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

"కీలక" సంస్థల ఏర్పాటుకు దయాకర్ రెడ్డి స్థలాల పరిశీలన

Date : 17 July 2024 08:48 PM

Telugu Rekha Media - తెలంగాణ / హన్మకొండ : ఖమ్మం పాలేరు నియోజక వర్గ పరిపాలన సౌలభ్యం కోసం.... నాణ్యమైన విద్యను అతి తక్కువ ఖర్చు కే అందించేందుకు.... కులమత బేధాలు లేకుండా గురుకులాలు అన్ని ఒకే చోట ఉండేలా చొరవ చూపుతున్నారు. పాలేరు నియోజకవర్గ ఎంఎల్ఏ, తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.... ఇందులో భాగంగా మంత్రి సూచనల మేరకు క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి పలు ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను బుధవారం పరిశీలించారు. ఏసీపీ కార్యాలయం , రెవెన్యూ, రిజిస్ట్రేషన్ తదితర నియోజక వర్గ కార్యాలయాలు అన్ని ఒకే చోట ఉంటే పరిపాలన సౌలభ్యంతో పాటు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందనే సదుద్దేశంతో ఖమ్మం రూరల్ మండలం తరుణి హాట్ ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. అతి తక్కువ ఖర్చులో కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్యను అందించేందుకు ముందుకు వచ్చిన స్వామి నారాయణ స్కూల్ యాజమాన్యానికి స్థలాన్ని ఇచ్చేందుకు శ్రీ సిటీ దగ్గర్లోని ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. ఇందుకోసం తిరుమలాయపాలెం మండలంలోని మరో స్థలాన్ని కూడా పరిశీలించనున్నారు. అదేవిధంగా పొన్నెకల్ లో ఇంటిగ్రేటెడ్ గురులాల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు అన్ని ఒకే చోట ఉండి కులమత బేధాలు అనేవి లేకుండా ఉంటాయనేది ప్రభుత్వ సదాభిప్రాయం. వీలైనంత త్వరగా మంత్రి పొంగులేటి చొరవతో వీటిని ఫైనల్ చేసి పాలేరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని దయాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్ , శాఖమూరి రమేష్ , జొన్నల గడ్డ రవి, కొప్పుల చంద్ర శేఖర్, కొడాలి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :