Wednesday, 15 April 2026 03:38:54 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

సిఎం చెప్పినట్టే చేద్దాం...

-- హీరో సిద్ధార్థ్ కామెంట్స్‌.

Date : 09 July 2024 10:24 AM

Telugu Rekha Media - తెలంగాణ / ఆదిలాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు చెబితేనో నా బాధ్యత నాకు గుర్తు రాదని నేను ఎప్పుడు బాధ్యతతోనే ఉంటానంటూ హీరో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. డ్రగ్స్‌పై కచ్చితంగా సినిమా వాళ్లు వీడియో చేయాలన్న ప్రతిపాదనపై భారతీయుడు 2 ప్రెస్‌మీట్‌లో అతను ఇలా స్పందించాడు. కాసేపటికి మరో వీడియో రిలీజ్ చేశాడు. తన మాటలను వక్రీకరించారని... ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలకు తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని అన్నాడు. రేవంత్ రెడ్డి చెప్పినట్టు పిల్లల భవిష్యత్‌ మనలాంటి వాళ్లపై కూడా ఆధార పడి ఉంటుందని అందుకే డ్రగ్స్‌కు దూరంగా ఉంచడం అందరి బాధ్యత అని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తన ఫుల్ సపోర్టు ఉంటుందని చెప్పుకొచ్చాడు. కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు.. సినీ పరిశ్రమపై ప్రత్యక్షంగా ప్రభావం చూపించడం మొదలుపెట్టాయి. ప్రభుత్వాలు మారుతున్నకొద్దీ ఏదో ఒక విధంగా సినీ పరిశ్రమపై ప్రభావం పడుతూనే ఉంది. అదే విధంగా తెలంగాణలో ప్రభుత్వం మారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మారిన తర్వాత ఇండస్ట్రీలో ఒక పెద్ద మార్పు తీసుకురావాలని ఆయన అనుకున్నారు. అందుకే పాన్ ఇండియా చిత్రాలకు టికెట్ రేట్లు పెరగాలంటే ఆ సినిమాలో పనిచేసిన యాక్టర్లు.. ఏదో ఒక సోషల్ మెసేజ్‌ను రికార్డ్ చేసి విడుదల చేయాలని ఆయన అన్నారు. దీనిపై తాజాగా ‘భారతీయుడు 2’ తెలుగు ప్రెస్ మీట్‌లో హీరో సిద్ధార్థ్ స్పందించాడుముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన కొత్త రూల్ గురించి మాట్లాడుతూ యాక్టర్లుగా మీకు సామాజిక బాధ్యత ఉందా అంటూ ‘భారతీయుడు 2’ ప్రెస్ మీట్‌లో కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్‌కు ప్రశ్న ఎదురయ్యింది. ఆ ప్రశ్న నచ్చని సిద్ధార్థ్.. సీరియస్‌గా రిప్లై ఇచ్చాడు. ‘‘నా పేరు సిద్ధార్థ్. గత 20 ఏళ్లుగా నేను తెలుగు ప్రేక్షకులకు తెలుసు. మొదటిసారి ఒక తెలుగు సినిమా తరపున కండోమ్ చేతిలో పట్టుకొని ప్లీజ్ కండోమ్ వాడండి అని చెప్తూ పెద్ద బిల్‌బోర్డ్స్‌పై నా మొహం కనిపించేలా నేను ప్రభుత్వంతో సహకరించాను’’ అంటూ అప్పటి రోజులను గుర్తుచేసుకున్నాడు సిద్ధార్థ్. అలాంటి అవగాహనలో పాల్గొన్న మొదటి హీరో తానే అని చెప్పుకొచ్చాడు.2005 నుంచి 2011 వరకు ఎక్కడ మీకు సేఫ్ సె* అనే బోర్డింగ్ కనిపించినా సిద్ధార్థ్ అనే వ్యక్తి చేతిలో కండోమ్ ఉండేది. అలా చేయడం నా బాధ్యత. ఒక ముఖ్యమంత్రి చెప్పారని ఆ బాధ్యత నాకు రాదు. ఒక యాక్టర్‌కు బాధ్యత ఉందా అనే ప్రశ్నకు నేను నో కామెంట్స్ అని చెప్పాలి. ఎందుకంటే అసలు ఆ ప్రశ్నే నాకు అర్థం కాలేదు. ప్రతీ యాక్టర్‌కు సామాజిక బాధ్యత ఉంటుంది. మాకు ఉన్నంత తెలివిలో మేము పనిచేస్తుంటాం. ఏ ముఖ్యమంత్రి అయినా మమ్మల్ని ఏదైనా చేయమని రిక్వెస్ట్ చేస్తే ఆ పని మేము చేస్తాం. కానీ ఏ సీఎం కూడా మాతో అలా చెప్పలేదు’’ అని క్లారిటీ ఇచ్చాడు సిద్ధార్థ్. అంతే కాకుండా ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వద్దని రకుల్‌ను, కమల్ హాసన్‌ను కోరాడు సిద్ధు.కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న సిద్ధార్థ్.. మళ్లీ యాక్టివ్ అయ్యాడు. బ్యాక్ టు బ్యాక్ తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో భాగంగానే శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భారతీయుడు 2’లో సెకండ్ హీరోగా నటించాడు. ఇప్పటికే ఎన్నో ఇబ్బందుల మధ్య షూటింగ్ పూర్తి చేసుకొని, ఎన్నోసార్లు వాయిదాలు పడిన ‘భారతీయుడు 2’.. ఫైనల్ జులై 12న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ టీమ్ అంతా యాక్టివ్‌గా ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది. అలా తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో పాటు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ కూడా జరిగింది.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :