Wednesday, 29 July 2026 02:18:22 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

డ్రగ్స్ గంజాయి నివారణలో యువత భాగస్వాములు కావాలి...

గంజాయి రహిత జిల్లాగా మార్చడమే మా లక్ష్యం యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి... -- జిల్లా ఎస్ పి అశోక్.

Date : 10 July 2024 11:57 AM

Telugu Rekha Media - తెలంగాణ / జగిత్యాల్ : సమాజం నుంచి యువత మంచిని మాత్రమే నేర్చుకోవాలని చెడు వ్యసనాలు, అలవాట్లపై, ఆకర్షితులై జీవితాలు నాశనం చేసుకోకూడదని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే పరిణామాల పై అవగాహన చేయడంతో పాటు వినియోగించడం వల్ల కలిగే నష్టలపై యువతకు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు దిశా నిర్దేశం చేసే కార్యక్రమం లో బాగంగా ఈ రోజు స్థానిక శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. యవత విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా మంచిగా చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. మత్తు పదార్థాలకు మానసికగా బానిస కావడం ద్వారా అనుకోకుండా క్రైమ్ చేసే అవకాశం ఉంది అని అన్నారు. అనుకోకుండా ఏదైనా క్రైం చేసినట్లయితే ఎలాంటి ఉద్యోగం కూడా రాదని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్ స్టాన్స్ యాక్ట్ ప్రకారం శిక్షార్హులు అవుతారని అన్నారు. చట్టాలు బలంగా ఉన్నాయని తర్వాత బాధపడి లాభం లేదని అన్నారు. కావున డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో ఉన్నత లక్ష్యాల ను సాధించాలనీ సూచించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల నడవడికను, అలవాట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, డ్రగ్స్, మత్తు పదార్థాలు, గంజాయి గురించిన సమాచారం తెలిస్తే స్థానిక పోలీసులకు గాని, డయల్ -100 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అన్నారు. ప్రస్తుత రోజుల్లో అనేక సైబర్ మోసాలు బాగా పెరిగాయి వీటి నుంచి బయటపడేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. సైబర్ నేరాల బారినపడిన వెంటనే ఆలస్యం చేయకుండా టోల్ ఫ్రీ నెంబర్ 1930 ను ఆశ్రయించాలి అన్నారు. జిల్లాలో డ్రగ్స్ రహిత వాతావరణం నెలకొల్పేందుకు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందిని డ్రగ్స్, గంజాయి రహిత జిల్లాలుగా మార్చడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాలు సేవించడం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి విద్యార్థులకు వీడియోల ద్వారా అవగాహన కల్పించడం జరిగింది. డ్రగ్స్ నివారణలో యువత యొక్క పాత్ర పై ఎస్పీ గారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన విద్యార్థిని, విద్యార్థులకు ఎస్పి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి రఘు చందర్, టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, కళాశాల ప్రిన్సిపాల్ రాజేందర్, ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :