Wednesday, 15 April 2026 03:19:27 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

దొడ్డి కొమురయ్య త్యాగం చిరస్మరణీయం...

-- జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.

Date : 04 July 2024 10:26 PM

Telugu Rekha Media - తెలంగాణ / కరీంనగర్ : తెలంగాణ స్వయం పాలన ఆకాంక్షలకు ఊపురిలూదిన సాయుధ కాలపు తొలి అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. గురువారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతిని పురస్కరించుకొని కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆ మహా యోధుడి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి తరతరాలుగా గుర్తుండిపోతుందని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కడివెండి గ్రామంలో ఒక సాధారణ కురుమ కులానికి చెందిన కుటుంబంలో జన్మించిన కొమురయ్య ఒక మహోన్నత ఉద్యమానికి ఆధ్యుడు అవడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. అదేవిధంగా కురుమ, బీసీ సంఘాల నాయకులు దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డిఆర్ఓ పవన్ కుమార్, బిసిడిఓ అనిల్ ప్రకాష్, అసిస్టెంట్ బీసీడీవో రాజ మనోహర్ రావు, కురుమ, బీసీ సంఘాల ప్రతినిధులు మీసా బీరయ్య, కర్రె పావని, కడారి ఐలయ్య, జక్కని సంజయ్ కుమార్, గుంటి స్వరూప, విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :