Wednesday, 29 July 2026 01:04:52 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు...

-- గుర్తించిన ఎ న్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడి)

Date : 13 June 2024 05:16 PM

Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు జరిగినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడి) గుర్తించింది. ఈ క్రమంలో అక్రమాలపై ఈడి ఫోకస్ పెట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం(పిఎంఎల్ఏ) కింద విచారణ చేపట్టనున్నట్లు తెలంగాణ పశుసంవర్ధక శాఖకు ఈడి నోటీసులు ఇచ్చింది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని ఈడి అధికారులను ఆదేశించింది. తెలంగాణలో గొర్రెల కొనుగోలులో రూ. 700 కోట్ల స్కామ్ జరిగినట్లు ఏసిబి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ గొర్రెల కొనుగోలు వ్యవహారంపై ఈడి దృష్టి సారించింది. మనీలాండరింగ్ కోణంలో ఈడి దర్యాప్తు చేయనున్నది. జిల్లాలవారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామా, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతల వివరాలు వంటి సమాచారం ఇవ్వాలని ఈడి కోరనున్నది. అదే క్రమంలో గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, చెల్లింపు వివరాలు, గొర్రెల దాణా, దానిని ఎయే లబ్ధిదారులకు ఇచ్చారు అనే వివరాలు సేకరించనున్నారు. ఇంకా దీని కోసం ఎవరికి నిధులు ఇచ్చారనే అంశాన్ని కూడా ఈడి వివరాలు కోరనున్నది.గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం నిందితుల విచారణ ముగిశాక వారిని ఏసిబి అధికారులు చంచల్ గూడ జైలుకు పంపించారు. ఏసిబి అధికారులకు వీరు సరైన సమాధానం ఇవ్వలేదని సమాచారం. ఇప్పటి వరకు 10 మందిని అరెస్టు చేశారు. ఇదిలావుండగా దర్యాప్తులో భాగంగా ప్రస్తుతం జైలులో ఉన్న పశుసంవర్ధక శాఖ సిఈవో రామ్ చందర్ నాయక్, మాజీ ఓఎస్ డి కళ్యాణ్ కుమార్ లను ఏసిబి అధికారులు కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు వీరిని విచారించేందుకు కోర్టు అనుమతినిచ్చింది.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: