Thursday, 30 July 2026 04:10:02 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

నీట్ పరీక్షను రద్దు చేయాల్సిందే...

Date : 06 July 2024 12:30 PM

Telugu Rekha Media - తెలంగాణ / సూర్యాపేట్ : నీట్ పరీక్ష పేపర్లో లీకేజీ మూలంగా 24 లక్షల మంది విద్యార్థులు అన్యానికి గురైన కనీసం స్పందించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం మొండివైఖరికి నిరసనగా చిలుకూరు మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి చేపూరి కొండలు మాట్లాడుతూ నీట్ పరీక్ష పత్రాల లీకేజీ మూలంగా 24 లక్షల మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి పాలనలో దేశవ్యాప్తంగా పదేళ్లలో 72 పరీక్షా లీకేజీలు జరగటం అంటే పరీక్ష నిర్వహణలో బిజెపి కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతున్న పరిస్థితి ఉంది. నీట్ పరీక్ష నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టి ఏ) నిర్లక్ష్యం మూలంగా 24 లక్షల మంది నీట్ విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని వారన్నారు. నీట్ పరీక్ష పత్రాల లీకేజీ అయిందని నీట్ విద్యార్థులు న్యాయం చేయాలని నీట్ పరీక్షలను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని గత 25 రోజులుగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కనీసం స్పందించకుండా ఎటువంటి సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అంటే విద్యార్థుల పట్ల వారికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు. మూడోసారి అధికారులకు రాగానే మాకు ఎదురులేదని నేను చెప్పింది వేదం అనే రీతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని వారన్నారు. ఇకనైనా నీట్ పరీక్షలను రద్దుచేసి తిరిగి నిర్వహించకపోతే 6న జరిగే కౌన్సిలింగ్ ను అడ్డుకోవడానికైనా వెనకాడబోమని వారు హెచ్చరించారు. కనీసం తెలంగాణలోని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కనీసం విద్యార్థులకు జరిగిన అన్యాయం పట్ల ఒక్క మాట కూడా మాట్లాడే పరిస్థితి లేదు కానీ సింగరేణి కొనుగోలు పట్ల అతిశయోక్తి చూపిస్తున్నారు తప్ప విద్యార్థుల భవిష్యత్తు గురించి పట్టించుకునే పరిస్థితి లేదు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ల సొంత ప్రయోజనాలు కోసం పాటుపడే బిజెపి కేంద్ర ప్రభుత్వాన్ని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రశ్నించాలని వారు కోరారు. జులై 6న జరిగే నీట్ కౌన్సిలింగ్ను అడ్డుకొని తీరుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మనబోయిన నరేష్ ఏఐవైఎఫ్ చిలుకూరు మండల అధ్యక్షులు అనంతుల రాము, నాయకులు కడారు మధు, బొల్లెద్దు చందు కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: