Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు హైకోర్టులో ఊరట లభించింది. 2011 రైల్ రోకో కేసులో విచారణకు హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 18వ తేదీకి వాయిదా వేసింది. కాగా, తనపై నమోదైన రైల్ రోకో కేసును కొట్టివేయాలని కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
Admin
Telugu Rekha Media