Saturday, 13 June 2026 08:19:23 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనుగోలు...

-- రూ.2 వేల కోట్లు అదనపు భారం, జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్ కు వివరాలు అందించిన విద్యుత్ అధికారి రఘు.

Date : 18 June 2024 06:32 PM

Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనుగోలు చేయడంతో రూ.2 వేల కోట్లు అదనపు భారం తెలంగాణపై పడిందని విద్యుత్ అధికారి రఘు తెలిపారు. బిఆర్‌ఎకె భవన్‌లో భద్రాద్రి, యదాద్రి విద్యుత్ ప్లాంట్లు, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్ విచారణ జరుపుతోంది. కమిషన్‌కు విద్యుత్ అధికారి రఘు వివరాలు అందించారు. కమిషన్ కార్యాలయానికి టిజెఎస్ అధ్యక్షుడు కోదండరాం కూడా వచ్చారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఎంఒయు చేసుకుందని, ఛత్తీస్‌గఢ్ డిస్కంలతో అప్పటి తెలంగాణ ప్రభుత్వం డిస్కంలు పిపిఎ చేసుకున్నాయని, ఛత్తీస్‌గఢ్‌తో చేసుకున్న పిపిఎలకు ఇంతవరకు ఆమోదం లభించలేదని రఘు పేర్కొన్నారు.భద్రాద్రి పవర్ ప్లాంట్‌ను నామినేషన్ పద్ధతిలో బిహెచ్‌ఎల్‌కు అప్పగించారని, కాంపిటేటివ్ బిడ్డింగ్ వెళ్తే ఆలస్యం అవుతుందని, నామినేషన్ పద్ధతిలో బిహెచ్‌ఇఎల్‌కు ఇచ్చారని, భద్రాద్రి పవర్‌ప్లాంట్‌లో ఇప్పటికే చాలా సమస్యలు వస్తున్నాయని, భద్రాద్రి పవర్ ప్లాంట్‌లో నాణ్యత లేని యంత్రాలు ఉపయోగించారని, భద్రాద్రి పవర్‌ప్లాంట్‌ను గోదావరి ఒడ్డున నిర్మించడంతో గోదావరి వరదలు వచ్చి ప్రతీసారి ప్లాంట్ మునిగిపోతుందన్నారు. సాంకేతిక పరమైన అంశాలు దృష్టిలో పెట్టుకోకుండా భద్రాద్రి పవర్ ప్లాంట్ పెట్టారన్నారు. బొగ్గు గనులకు 280 కిలో మీటర్ల దూరంలో యాదాద్రి పవర్ ప్లాంట్ పెట్టారని, బొగ్గు గనులకు దూరంగా పెట్టడంతో రవాణా ఛార్జీలు పెరుగుతాయన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :