Saturday, 13 June 2026 07:07:29 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

జీరో టిక్కెట్ తో మోసాలు...

Date : 06 August 2024 11:29 AM

Telugu Rekha Media - తెలంగాణ / ఆదిలాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు పథకం విజయవంతంగా నడుస్తోంది. ఆరు నెలలుగా ఈ పథకం ఎలాంటి అంతరాయం లేకుండా అటు ప్రభుత్వానికి కూడా ఆదాయం పెంచుతూ ఊరటనిస్తోంది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో బస్సులలో మామూలు కన్నా ఆక్యుపెన్సీ పెరిగిందని అధికారులు చెబుతున్నారు. అలాగే ఆర్టీసీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సంస్థ ఆదాయాన్ని పెంచుకుంటోంది. దీనితో రాష్ట్ర ప్రభుత్వంపై పెద్దగా భారం పడలేదని అంటున్నారు. మొదట్లో ఈ పథకం అమలు చేయడంలో ఉన్న లోటుపాట్లను సరిచేయడానికి ఆర్టీసీ అధికారులు జీరో టిక్కెట్లు కూడా జారీ చేస్తున్నారు.ఉచిత ప్రయాణం చేసే ప్రతి మహిళకూ జీరో టిక్కెట్లను కొట్టడం ద్వారా ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపించే అవకాశం లేదు. దీనితో ఏ రోజుకారోజు ఎంత మంది తిరిగారో వారిపై ఎంత ఆదాయం అనేది జీరో టిక్కెట్ల ద్వారా ప్రభుత్వానిి తెలుస్తుంది. అయితే దీనిని తనకు అనుకూలంగా మార్చుకున్నారు కొందరు కండెక్టర్లు. అసలే అంతంత మాత్రంగా వస్తున్న ప్రభుత్వాదాయానికి ఏకంగా గండిపెట్టేందుకు యత్నిస్తున్నారు. జీరో టిక్కెట్లు కేవలం ఆడవారికి మాత్రమే ఇవ్వాలి. అయితే నిబంధనలకు విరుద్ధంగా మగవారి వద్ద డబ్బులు తీసుకుని జీరో టిక్కెట్లు ఇస్తున్నారు కండెక్టర్లు. బస్సు ప్రయాణంలో అవన్నీ పట్టించుకోరు కదా ప్రయాణికులు అనుకుంటే పొరపాటే. కొందరు మాత్రం తాము చెల్లించిన డబ్బుకు సరిపడ టిక్కెట్ లో ఉందా లేదా అని చూసుకుంటారు. ఇదేంటని ఎవరైనా కండెక్టర్ ను నిలదీస్తే..సారీ పొరపాటున ఇచ్చానని మళ్లీ వాళ్లకు మామూలు టిక్కెట్లు ఇస్తున్నారు. ఇదంతా దొరికితే దొంగ లేకుంటే దొర అన్న రీతిగా కండెక్టర్లు యథేచ్ఛగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా బొక్క పెడుతున్నారు.ఇటీవల హైదరాబాద్ లో ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురయింది. దానితో కండెక్టర్ ను గట్టిగా నిలదీసేసరికి పొరపాటున ఇచ్చామని ఆ టిక్కెట్ రిటర్న్ తీసుకుని మామూలు టిక్కెట్ ఇష్యూ చేశాడు ఆ కండెక్టర్. మొత్తానికి ఈ వార్త ఆర్టీసీ అధికారులకు ఎట్టకేలకు చేరింది. దానితో మగవారి టిక్కెట్లను కూడా బస్సు ఆపి చెకింగ్ చేస్తున్నారు.గతంలోనూ ఆర్టీసీ బస్సు కండెక్టర్లపై చిల్లర తిరిగి ఇవ్వరని, ఒక్కో టిక్కెట్ పై పావలా, అర్థ రూపాయిలను చిల్లర లేదంటూ జేబుల్లో వేసుకునేవారు. దీనితో ప్రతి రోజూ చిల్లర సమస్యతో ఆర్టీసీ అధికారులు రౌండ్ ఫిగర్ చేసి టిక్కెట్ అమ్మకాలు కొనసాగించారు. చిల్లర సమస్య తీరడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు జీరో టిక్కెట్ల అంశంలో ఇప్పటిదాకా జరిగిన స్కామును బయటకు తీసే పనిలో ఉన్నారు ఆర్టీసీ అధికారులు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :