Saturday, 13 June 2026 07:06:43 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

మా గోడు పట్టించుకోండి...

-- భద్రాచలం విలీన గ్రామాల నేతలు.

Date : 05 July 2024 02:04 PM

Telugu Rekha Media - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఏపీలో విలీనమైన గ్రామాలను తిరిగి భద్రాచలంలో కలపాలని స్థానిక నేతలు, ప్రజలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు. ఈ మేరకు భద్రాచలం విలీన గ్రామాల నేతలు హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచుకులపాడు గ్రామ పంచాయతీలను తిరిగి భద్రాచలంలోనే విలీనం చేయాలని వారు మంత్రి తుమ్మలకు విజ్ఞప్తి చేశారు. ఈనెల 6వ తేదీన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ నేపథ్యంలో విలీన ప్రతిపాదనను వారి ముందు పెట్టాలని కోరారు. ఈ విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశానని, మరోసారి సీఎం దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్తానని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. అనంతరం స్థానిక సమస్యలపై మంత్రికి విలీన గ్రామాల ప్రజలు వివరించారు.

భద్రాచలం, చర్ల ప్రధాన రహదారిలో ఆంధ్రప్రదేశ్ పరిధిలోని ఎటపాక ఆర్ అండ్ బీ రోడ్డు దుస్థితిని ఆయనకు వివరించారు. రోడ్డు పరిస్థితి దారుణంగా ఉందని, ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. వెంటనే స్పందించిన మంత్రి ఏపీ ఆర్ అండ్ బీ సీఈతో ఫోన్‌లో మాట్లాడారు. మరమ్మతులు చేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలని అధికారిని కోరారు. విలీన గ్రామాల రైతులకు రుణమాఫీ విషయంలో ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా చూడాలని మంత్రిని నేతలు కోరగా.. ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారికి సూచించారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :