Telugu Rekha Media - తెలంగాణ / జగిత్యాల్ : అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా మంజూరైన నిధులతో పాఠశాలలోని పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. శుక్రవారం రోజున అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా కోరుట్ల ఉర్దూ మీడియం పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో కనీస మాలిక సదుపాయాలు, విద్యుత్, త్రాగునీరు, పెద్ద, చిన్న మరమ్మత్తుల పనులను పెండింగ్ లో ఉన్నట్లయితే త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాల ప్రహరీ గోడకు బదులు తాత్కాలిక ఫెన్ షింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అదే విధంగా పాఠశాలలోని ప్రతీ విద్యార్థి పై ప్రత్యేక దృష్టి సారించాలని, సర్కారు బడుల్లో క్వాలిఫైడ్ ఉపాద్యాయులు పనిచేస్తున్నారని, భావి తరాలకు అవసరమైన విద్యా బోధన చేయడం జరుగుతున్నదని తెలిపారు. డిజిటల్ క్లాస్ నేర్పిస్తున్నారా అని విద్యార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.10 వ తరగతి విద్యార్థులకు వంద శాతం ఉత్తీర్ణత వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని, వెనుక బడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద వహించి వంద శాతం ప్రగతి సాధించే విధంగా విద్యా బోధనకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఆనంద్ కుమార్, డీఈవో జగన్ మోహన్ రెడ్డి, మండల విద్యాధికారి శశి కుమార్, ఎమ్మార్వో, పాఠశాల ఉపాద్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media