Wednesday, 15 April 2026 03:45:55 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

డీఎస్సీ రద్దు కుదరదు...

-- డిప్యూటీ సీఎం కీలక విజ్ఞప్తి.

Date : 15 July 2024 04:58 PM

Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : కేసిఆర్ ప్రభుత్వంలో పేపర్ లీకేజీలతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ప్రజలు, నిరుద్యోగ, యువతీ యువకులకు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం తెచ్చుకుంది ఉద్యోగాల కోసమని తెలిపారు. అనేక ఉద్యమాలు, విద్యార్థుల ఆత్మబలిదానాల ఫలితం తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. అందుకే తమ ప్రభుత్వం ఉద్యోగాలపై దృష్టి పెట్టి 30వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని వెల్లడించారు. విద్యా వ్యవస్థ బలోపేతం, పేద విద్యార్థులకు మంచి విద్యానందించాలని డీఎస్సీ ప్రకటించామని తెలిపారు. గాంధీభవన్‌లో భట్టివిక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. పదేళ్లు డీఎస్సీని ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ విడుదల చేసి ఓట్ల కోసం తాపాత్రయ పడ్డారని విమర్శించారు. 5వేల నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించకపోవడంతో తమ ప్రభుత్వం రాగానే 11 వేలకు పైగా పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చామని గుర్తుచేశారు. 16వేల టీచర్ పోస్టులుఖాళీగా ఉన్నట్టు గుర్తించామని, 19,718 టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు చేపట్టామని వివరించారు. ఇప్పటికే అభ్యర్థులు హాల్ టికెట్లు 2లక్షల 500కు పైగా డౌన్ లోడ్ చేసుకున్నారని వివరించారు. మొత్తం 2లక్షల 79వేలమంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కొంతమంది పోస్ట్‌పోన్ చేయమని ధర్నాలు చేస్తున్నారని అలా చేయడం తగదని దీనివల్ల అభ్యర్థులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం రాగానే గ్రూప్ 1పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించి రిజల్ట్ ప్రకటించామని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో పేపర్ లీకేజీలతో నిరుద్యోగ యువకులు నష్టపోయిన విషయాన్ని గుర్తించామని అన్నారు. గ్రూప్ 2 కూడా గత ప్రభుత్వం మూడు సార్లు పోస్ట్ ఫోన్ చేసిందని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం మళ్లీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. గ్రూప్ 3 కూడా నిర్వహించలేకపోతే మళ్లీ తాము షెడ్యూల్ చేశామని అన్నారు. ఇవన్నీ నిరుద్యోగులకు నష్టం కలగొద్దని తమ ప్రయత్నమని వివరించారు. ఇవి కాక వివిధ శాఖల్లో పోస్టులు 13,321 టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో భర్తీ చేస్తున్నామని తెలిపారు. డీఎస్సీని కూడా పకడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు. మరో డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. త్వరలోనే పోస్టుల సంఖ్యతో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. అందరూ మంచిగా ప్రిపేరై ఉద్యోగాలు సాధించి విద్యార్థులకు మంచి విద్యను అందించాలని కోరుతున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :