Wednesday, 15 April 2026 03:40:27 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

కుక్కల వృద్ధి నియంత్రణ కేంద్రాన్ని వినియోగించుకోవాలి...

-- జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ...

Date : 24 July 2024 11:20 PM

Telugu Rekha Media - తెలంగాణ / భూపాలపల్లి : కుక్కల వృద్ధి నియంత్రణ కేంద్రాన్ని వినియోగంలోకి తేవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బుధవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన కుక్కల వృద్ధి నియంత్రణ కేంద్రం, బాంబుల గడ్డ వద్ద ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్, కలక్టర్ కార్యాలయం వెనుక ఉన్న తుమ్మల చెరువును మున్సిపల్ అధికారులతో కలిసి పరిశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కుక్కల వృద్ధి నియంత్రణకు కు.ని ఆపరేషన్లు నిర్వహించేందుకు అనుభవజ్ఞులై వైద్యాధికారుఆ ద్వారా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కుక్కల వృద్ధిని నియంత్రణ చేసేందుకు వీధి కుక్కలను యానిమల్ బర్త్ కేర్ యూనిట్ కు తరలించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి, సంరక్షణ తదుపరి వాటిని యదావిధిగా పట్టుకున్న స్థానాలలో విడిచి పెట్టాలని తెలిపారు. కుటుంబ నియంత్రణ వల్ల వీధి కుక్కల వృద్ధిని నియంత్రణ జరుగుతుందని తెలిపారు. బాంబుల గడ్డ వద్ద ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలని తెలిపారు. ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్త సేకరణ పక్కాగా జరగాలని, సేకరించిన వ్యర్దాలను డంపింగ్ యార్డులో వర్మీ తయారు చేసి వ్యర్దాలు నుండి ఆదాయం సమకూర్చే విధంగా మున్సిపాలిటీ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అనంతరం కలక్టరేట్ కార్యాలయం వెనుక ఉన్న తుమ్మలను పరిశీలించారు. పట్టణం నడిబొడ్డున ఉన్న ఈ చెరువును అందంగా తీర్చి దిద్ది ప్రజలు వాకింగ్ చేసేందుకు వాకింగ్ ట్రాక్, పూలమొక్కలు, కూర్చోడానికి బల్లలు, కుర్చీలు ఏర్పాటు చేసి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే విధంగా తయారు చేయాలని పేర్కొన్నారు. వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి వెనుక వైపు నీరు నిల్వ ఉండకుండా గ్రావెల్ తో నింపి, డ్రైనేజీలు నిర్మించి నీరు నిల్వలు లేకుండా చేయాలని మున్సిపల్ అధికారులను కలక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, ఏ.ఈ తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :