Saturday, 13 June 2026 07:04:37 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ప్రజల వద్దకే ప్రజా పాలన...

ఇంటింటికి వెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ... -- బంక చందు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు.

Date : 13 July 2024 08:38 PM

Telugu Rekha Media - తెలంగాణ / సిద్ధిపేట : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని ప్రజల వద్దకే పాలన అనే లక్ష్యంతో పనిచేస్తుందని హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంక చందు అన్నారు. శనివారం హుస్నాబాద్ నియోజకవర్గం హుస్నాబాద్ మండలంలోని గ్రామాలలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వివిధ గ్రామాలలోని 14 మందికి మొత్తం కలుపుకొని 3 లక్షల 50 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని ఆయన అన్నారు. గ్రామాలలో గాంధీనగర్, కుచనపల్లి, పందిళ్ళ, పొట్లపల్లి, మడుద, మహమ్మదాపూర్, పోతారం, జిల్లెల గడ్డ, మీర్జాపూర్, తోటపల్లి గ్రామాలలోని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగినది. ఇట్టి పంపిణీ కార్యక్రమంలో హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంక చందు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వెన్నరాజు, పొతుగంటి బాలయ్య, సంఘ కుమార్, తైలం విక్రమ్ గట్టు రాములు బొంగోని శ్రీనివాస్, పోలు సంపత్ దానవీని రమేష్ మామిడి రాజు, మడప యాదవ రెడ్డి, అలువోజు కుమారస్వామి, మాదాటి వెంకట్ రెడ్డి, బొమ్మగాని అంజయ్య, కట్కూర్ భాస్కర్ రెడ్డి, గాలిపల్లి శ్రీనివాస్, కళ్ళపల్లి వెంకటస్వామి, దేవ సాని నరసింహారెడ్డి, రామగిరి కుమార్, రణధీర్, సంఘ శ్రీధర్, ఇంద్రసేనారెడ్డి, బొమ్మగాని హరిబాబు, బొమ్మగాని రాజు, ఏలేటి జగ్గారెడ్డి, దొంతర వేణి శ్రీనివాస్., తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు. వారి యొక్క ఆరోగ్య రీత్యా ప్రైవేటు హాస్పిటల్ లో వైద్యం చేసుకోగా అయినా ఖర్చులో నుండి కొంత భాగాన్ని వారికి చేదోడు వాదోడుగా ఉంటుంది అని, సీఎం నిధి నుండి సీఎం రిలీఫ్ ఫండ్ గా కొంత నగదు ఇచ్చి వారిని, వారి కుటుంబాన్ని ఆదుకున్నట్టు ఉంటుందని వారి వారి గ్రామాలలోకి వెళ్లి ఈ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వము మండల కేంద్రానికి పిలిపించుకొని చెక్కులు పంపిణీ చేసేది అని అలాగే అప్పటి ప్రభుత్వ గ్రామస్థాయి నాయకులను తీసుకువెళ్లి చెక్కులు తెచ్చుకునేది, కానీ ఇప్పుడు ఉన్న ప్రజా ప్రభుత్వం ప్రజా పరిపాలన దిశగా వారి యొక్క మండల స్థాయి గ్రామస్థాయి నాయకులతో మా గ్రామానికి వచ్చి చెక్కులు ఇవ్వడం చాలా సంతోషకరమని, మా హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :