Saturday, 13 June 2026 07:06:43 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

పీవీ ఆర్థిక సంస్కరణలతోనే దేశాభివృద్ది...

-- జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

Date : 28 June 2024 10:43 PM

Telugu Rekha Media - తెలంగాణ / పెద్దపల్లి : పీవీ ఆర్థిక సంస్కరణలతోనే దేశాభివృద్ది జరిగిందని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. శుక్రవారం మాజీ ప్రధాని, బహుబాషాకోవిదుడు,పీవీ నరసింహరావు జయంతిని పురస్కరించుకుని మంథని పట్టణంలోని పీవీ కాంస్య విగ్రహానికి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి దేశ ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చిన ఘనత పీవీకే దక్కిందన్నారు. పీవీ మరణిస్తే ఆయనకు కాంగ్రెస్‌ పార్టీ సరైన గౌరవం ఇవ్వలేదని, ఆయన అంత్యక్రియలు చేయకుండా పార్థివ దేహాన్ని పూర్తిగా కాలకుండా అవమానపర్చారని అన్నారు. పీవీ సామాజికవర్గానికి చెందిన వారు మంథని నియోజకవర్గంలో ఆయన పేరుతో ఎదిగి అనేక పదవులు పొందారే కానీ ఏనాడు పీవీ గురించి ప్రజలకు చెప్పలేదని, కనీసం పీవీ చిత్రపటాన్ని ప్రజలకు చూపించకుండా అవమానపర్చారని విమర్శించారు.

అట్టడుగు వర్గాల కోసం త్యాగాలు చేసిన మహనీయులను చూపించాల్సిన బాధ్యతను గత పాలకులు తీసుకోకపోగా వారిని అవమానించారని,కానీ బీసీ సామాజికవర్గం నుంచి వచ్చిన తాను ఇక్కడ మహనీయుల చరిత్రను చాటి చెప్పడంతో పాటు మంథని ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర మాదేనన్నారు. కేవలం కాంగ్రేసేతరులు మాత్రమే పీవీని గౌరవించారని ఆయన గుర్తు చేశారు. డిల్లీ నుంచి గల్లీ వరకు ఒకే విధానం పాటిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ పీవీ నర్సింహరావును అగౌరపర్చిందని, డాక్టర్‌బీఆర్‌ అంబేద్కర్‌ను అవమానించిందని గుర్తు చేశారు. గాంధీ కుటుంబ ఏతర వ్యక్తి ప్రధాన మంత్రి అయితే ఏ విధంగా అవమాన పర్చిందో పీవీని చూస్తే కాంగ్రెస్‌ పార్టీ విధానం అర్థం అవుతుందన్నారు. ఈనాడు దేశం ఆర్థికంగా అభివృద్ది పథంలో ముందుకు నడువడానికి పీవీ ఆర్థిక సంస్కరణలే కారణమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంథని జెడ్పిటిసి తగరం సుమలత, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, నాయకులు తగరం శంకర్ లాల్, బత్తుల సత్యనారాయణ, వేల్పుల గట్టయ్యలతో పాటు పలువురు పాల్గొన్నారు

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :