Thursday, 30 July 2026 05:26:51 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

బల్కంపేట ఆలయంలో బోనాల ఏర్పాట్లపై సమీక్ష...

Date : 25 June 2024 08:11 PM

Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవాలయంలో ఆషాఢ మాసం బోనాల నేపథ్యంలో అమ్మవారి కళ్యాణోత్సవ ఏర్పాట్లపై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. బోనాల సందర్భంగా అమ్మవారి కళ్యాణ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు, భక్తులకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలు, గతంలో జరిగిన ఇబ్బందులు పునరావృతం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా ఇప్పటికే పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. నగరంలో బోనాల కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. బల్కంపేట దేవాలయంలో అమ్మవారి కళ్యాణం ఉత్సవాలకు రాబోయే నెల రోజుల పాటు ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండడానికి అధికారులతో సమీక్షా సమావేశం జరుగుతుంది. ప్రభుత్వం బోనాల ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత సంవత్సరం బోనాలకు 15 కోట్లు నిధులు ఇస్తే దేవాదాయ శాఖ మంత్రి చొరవతో ఈసారి 20 కోట్లు కేటాయించారు. బల్కం పేట ఎల్లమ్మ ఆలయంలో పోలీసులు, విద్యుత్,వాటర్ వర్క్స్ ఇతర డిపార్ట్మెంట్ ల వారీగా సమీక్ష జరుపుకుంటున్నామని అన్నారు.

ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ,కమిషనర్ హన్మంతరావు , సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీ కోటా నిలిమా, స్థానిక కార్పొరేటర్ సరళ, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంత్ ,పోలీస్, విద్యుత్ , వాటర్ వర్క్స్,ఆర్ అండ్ బి ఇతర శాఖల అధికారులు పాల్గోన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :