Saturday, 13 June 2026 07:09:33 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ప్రాణం కాపాడిన స్మార్ట్ వాచ్...

-- ఒక్క అలెర్ట్ తో తప్పిన ప్రాణాపాయం...యాపిల్ వాచ్ అద్భుతం.

Date : 21 June 2024 12:09 PM

Telugu Rekha Media - తెలంగాణ / కరీంనగర్ : ఆరోగ్య సమస్యలను అలర్ట్ చేసేందుకు స్మార్ట్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. స్మార్ట్ వాచీలు, స్మార్ట్ రింగ్ లు , స్మార్ట్ బ్యాండ్ లు ఇలా పేరు ఏదైనా సరే ఫిట్నెస్, హెల్త్ ఇష్యూస్ పై అలర్ట్ చేస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ వాచ్ లలో ఫీచర్లు శరీర కదలికలను బట్టి ఫిట్నెస్ లెవల్స్, హార్ట్ బీట్, పల్స్ చెప్పేస్తున్నాయి. దీంతో ఇటీవల స్మార్ట్ వాచ్ ల వినియోగం పెరిగింది, స్మార్ట్ పరికరాల హవా కొనసాగుతోంది. వీటిల్లో ముఖ్యంగా యాపిల్ స్మార్ట్ వాచ్ లకైతే ప్రత్యేక డిమాండ్ ఉంది. వీటిల్లో రీడింగ్స్ కచ్చితత్వం ఉంటాయని ప్రజల్లో నమ్మకం. యాపిల్ వాచ్ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి సరైన సమయంలో హెచ్చరికలు జారీచేస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాపిల్ వాచ్ బీజేపీ నేత ప్రాణం కాపాడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ యాపిల్ వాచ్ వాడుతున్నారు. గత కొంత కాలంగా కొంత దూరం నడిస్తే ఆయాసం, ఛాతిలో నొప్పి, మంటలా ఉన్నా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. గ్యాస్ట్రిక్ సమస్య అనుకుని వదిలేశారు. అయితే ఆయన వాడుతున్న యాపిల్ వాచ్ ఓ అలర్ట్ పంపింది. గుండెపోటు ప్రమాదం ఉందని దాని సారాంశం. దీంతో ఆయన నిర్లక్ష్యం చేయకుండా గుండెకు సంబంధించిన ఇబ్బంది ఉందని వరంగల్ వైద్యులను సంప్రదించారు. రామకృష్ణను పరీక్షించిన వైద్యులు గుండెకు సంబంధించిన రెండు రక్తనాళాలు మూసుకుపోయాయని గుర్తించారు. దీంతో ఆయన మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి వెళ్లారు. యశోదలో వైద్య పరీక్షలు చేయించుకుని, వైద్య సేవలు పొందారు. గత కొద్ది కాలంగా వాడుతున్న యాపిల్ వాచ్ తన ప్రాణాలను కాపాడిందని బీజేపీ నేత ప్రతాప రామకృష్ణ అన్నారు. యాపిల్ వాచ్ ఆరోగ్య పరిస్థితిని తెలియజేసే సామర్థ్యాలను కలిగి ఉందని మరోసారి నిరూపించింది. తీవ్రమైన గుండె పరిస్థితిని గుర్తించడంలో సహాయపడింది. కెనడాకు చెందిన 44 సంవత్సరాల వయసు గల ట్రావిస్ చామర్స్ అనే అగ్నిమాపక సిబ్బంది తన కుమారుడితో కలిసి రోడ్ హాకీ ఆడుతున్నాడు. అతని ఛాతీలో అకస్మాత్తుగా నొప్పి మొదలైంది. తీవ్రమైన తలనొప్పి కూడా వచ్చింది. మొదట్లో ఈ లక్షణాలు ఫ్లూ లేదా అలెర్జీల కారణంగా ఉన్నాయని భావించాడు. చామర్స్ వెంటనే తన హృదయ స్పందన రేటు అసాధారణంగా పెరిగినట్లు తెలుసుకున్నాడు. అతని యాపిల్ వాచ్ నుంచి వచ్చిన నోటిఫికేషన్‌ తో వెంటనే వైద్యులను సంప్రదించాడు. చామర్స్ యాపిల్ వాచ్ గుండెలో పరిస్థితి సక్రమంగా లేదని, వేగవంతమైన హృదయ స్పందన రేటు ఉందని నోటిఫికేషన్ పంపింది. ఇది స్ట్రోక్, గుండె ఆగిపోయే ప్రమాదాన్ని పెంచుతుందని తెలిపింది. దీంతో వైద్యులను సంప్రదించగా.. గుండెలో సమస్య ఉందని గుర్తించి చికిత్స అందించారు. యాపిల్ స్మార్ట్ వాచ్ తన ప్రాణాన్ని కాపాడిందని చికిత్స తర్వాత అతడు స్థానిక మీడియాతో చెప్పాడు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :