Saturday, 13 June 2026 08:29:40 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ప్రైవేట్ ఆస్పత్రిలో అక్రమ దందా..!

జోరుగా లింగ నిర్ధారణ పరీక్షలు అక్రమంగా అబార్షన్లు చేస్తున్న వైనం. హుజరాబాద్ లో ఘటన, నిందితుడిని అరెస్టు చేసిన హుస్నాబాద్ పోలీసులు.

Date : 11 July 2024 07:55 PM

Telugu Rekha Media - తెలంగాణ / కరీంనగర్-హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని మాధవి నర్సింగ్ హోమ్ లో ఓ వివాహితకు అక్రమంగా అబార్షన్ చేసిన ఘటనలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీసులు నిందితుని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించడం హుజురాబాద్ పట్టణంలో సంచలనం కలిగించింది హాస్పిటల్ డయాగ్నస్టిక్ సెంటర్ లపై పోలీసులు దాడి చేసి పిండాన్ని గర్భస్రావం చేసి తొలగించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ఆసుపత్రి పిఆర్ఓ ఒక మహిళా డాక్టర్ ఆసుపత్రి నిర్వహకులు సహకరించి ఆసుపత్రి సిబ్బందిపై పిసిపి ఎన్డిటి ఆక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు హుస్నాబాద్ పోలీసులు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన యువతి అదే పట్టణానికి చెందిన ఓ వ్యక్తితో కొంతకాలం సహజీవనం చేస్తుంది, కొద్దిరోజులగ క్రితం ఆమె గర్భం దాల్చింది. ఈ విషయాన్ని యువతి తల్లిదండ్రులకు చెప్పి ఆ యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఆ యువకుడికి ఇంతకుముందే వివాహం అయినట్టు గుర్తించిన తల్లిదండ్రులు తన కూతురుకు అబార్షన్ చేయించాలని నిర్ణయించుకున్నారు, అందుకు భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం టేకుమట్ల కు చెందిన ఆర్ఎంపి సహాయంతో జమ్మికుంట పట్టణంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఆ యువతిని హుజురాబాద్ లోని మాధవి నర్సింగ్ హోమ్ లో అక్రమంగా అబార్షన్ చేయించారు. ఈ భ్రూణ హత్య కేసు పై ఆ యువతి కుటుంబ సభ్యులపై హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. అయితే ఆమె కుటుంబ సభ్యులకు మధ్యవర్తం వహించిన వారిని జైలుకు పంపించడం జరిగింది. పట్టణంలోని మాధవి నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్న పాపిరెడ్డి, ఆసుపత్రి పి.ఆర్.ఓ సత్యనారాయణ, సిబ్బంది రజితను పోలీసులు అదుపులో తీసుకొని విచారించంగా యువతికి అబార్షన్ చేసినట్లు వెళ్లడైంది. అక్రమ అబార్షన్లు కు ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్డగా మారుతున్నాయి, విచ్చలవిడిగా డబ్బులు దండుకుంటూ అమాయక ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని పలు సంఘ నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అదేవిధంగా ఆర్ఎంపీల సహాయంతో లింగ నిర్ధారణ పరీక్షలు కూడా చేస్తూ బ్రూణ హత్యలకు పాల్పడుతున్న నర్సింగ్ హోమ్ లపై చట్టరీత్యా చర్యలు తీసుకొని ప్రైవేట్ ఆస్పత్రిలో ఆగడాలను అడ్డుకట్టవేయాలని కోరుతున్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :