Wednesday, 15 April 2026 03:39:47 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

పర్యావరణహితం లక్ష్యంగా బిజెపి పార్టీ ఆద్వర్యం అమ్మ పేరుతో ఒక్క చెట్టు...

- తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 5 లక్షల మొక్కలు నాటేలా లక్ష్యం. -- బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీనారాయణ..

Date : 28 June 2024 10:51 PM

Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పర్యావరణహితం లక్ష్యంగా అమ్మ పేరుతో మొక్కలు నాటేలా గొప్ప కార్యక్రమానికి పిలుపునిచ్చింది.శుక్రవారం పార్తి కార్యాలయం లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశం లో పార్టీ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీనారాయణ పార్టీ అధికార ప్రతినిది రాని రుద్రమ,యువమోర్చ రాష్ట్ర అద్యక్షులు మహేందర్ తో కలిసి మాట్లాడారు.ఇందులో బాగంగా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 5 లక్షల మొక్కలు నాటేలా లక్ష్యాన్ని నిర్దారించడం జరిగిందని చెప్పారు.జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్కులో ఏక్ పేడ్ మా కే నామ్ (అమ్మ పేరుతో ఒక్క చెట్టు ) పేరుతో ఒక మొక్కను నాటారు.కాశ్మీర్ కోసం శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారు 1953, జూన్ 23న బలిదానమయ్యారు.తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వంలో డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.1949లో నెహ్రూ పాకిస్థాన్ ప్రధానమంత్రి లియాఖత్ అలీ ఖాన్‌తో జరిపిన ఢిల్లీ ఒప్పందం (ఆర్టికల్ 370) అనంతరం ఏప్రిల్ 6, 1950 న ముఖర్జీ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి, బయటికి వచ్చారు.1951 అక్టోబరు 21న భారతీయ జనసంఘ్ పార్టీని స్థాపించి, 1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కోల్‌కతా పార్లమెంట్ స్థానం నుంచి ఎన్నికయ్యారు.కశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం, అధికారాలు, స్వయం ప్రతిపత్తిని ముఖర్జీ గారు తీవ్రంగా వ్యతిరేకించారు.జమ్మూ కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తి రద్దు(ఆర్టికల్-370) కోసం అవిశ్రాంతంగా పోరాడి, దేశ సమగ్రత కోసం శ్రమించారు.డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా, ఆ మహనీయుడి సేవలను స్మరించుకునేలా మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేసేలా భారతీయ జనతా పార్టీలో వివిధ కమిటీలను నియమించడం జరిగింది.జూన్ 29, 30 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లల్లో సమావేశాలు నిర్వహించి, ఆ సమావేశాల్లో డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారు దేశం కోసం చేసిన బలిదానం గురించి ప్రజలకు వివరించడంతో పాటు ప్రజలకు మొక్కలు పంపిణీ చేస్తాం.జులై 5, 6 తేదీల్లో జిల్లా కేంద్రాల నుంచి మండల స్థాయిలోని శక్తి కేంద్రాలకు పార్టీ శ్రేణులు వెళ్లి ప్రతి బూత్ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అమలు చేస్తాం.నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019లో ఆర్టికల్ 370 ను తొలగించి జమ్మూ కాశ్మీర్‌ను భారతదేశంలో కలపడం ద్వారా దేశాన్ని ఒక బలమైన… ఐక్య దేశంగా చూడాలనే డాక్టర్ ముఖర్జీ కలను సాకారం చేశారు.

** రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బూత్ పరిధిలో పది చొప్పున మొక్కలు : అనంతరం బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ మాట్లాడుతూ డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బూత్ పరిధిలో పది చొప్పున మొక్కలు నాటాలని పార్టీ నిర్ణయించింది.రాష్ట్ర కార్యాలయంలో భారతీయ జనతా పార్టీకి చెందిన వివిధ మోర్చాల నుంచి కమిటీలు ఏర్పాటు చేసి, కమిటీ సభ్యుల నుంచి ప్రజలకు మొక్కలు వితరణ చేయాలని పార్టీ నిర్ణయించింది. భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి జీవిత విశేషాలు, కశ్మీర్ కోసం వారు చేసి బలిదానం, దేశం కోసం త్యాగం చేసిన ముఖర్జీ గారి సేవలను స్మరించుకునేలా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై విజయంవంతం చేసేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేసారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :