Telugu Rekha Media - తెలంగాణ / జగిత్యాల్ : తడి, పొడి చెత్త వేరు వేరుగా ప్రతి ఇంటి నుండి సేకరించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మున్సిపల్ సిబ్బంది ఆదేశించారు.బుధవారం రోజున జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ లోని డంపింగ్ యార్డును జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్, ఆర్డీవో మధుసుధన్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీ లో ట్రాక్టర్ ద్వారా తడి, పొడి చెత్త వేరు వేరుగా ప్రతి ఇంటి నుండి సేకరించడం జరుగుతున్నదని తెలిపారు. పొడి చెత్తను సెగ్రిగేషన్ షెడ్డు ద్వారా క్రాప్ డీలర్లకు అమ్మాలని సూచించారు. పొడి చెత్త అనేది ప్లాస్టిక్, గాజు ఇతర భూమిలో కలవని చెత్త అని పేర్కొన్నారు. తడి చెత్త అనేది కూరగాయల వెస్ట్ అని దానితో కంపోస్టు గాని, వర్మీ కంపోస్టు గాని తయారు చేయించాలని తెలిపారు. డంపింగ్ యార్డును ఎప్పటికప్పుడు శానిటేషన్ చేపించాలని అధికారులని ఆదేశించారు.అనంతరం జిల్లాలో వీధి కుక్కల బెడద తగ్గించుటలో భాగంగా టీ.ఆర్ నగర్ జగిత్యాలలో నిర్మించిన ఎనిమల్ కేర్ సెంటర్ ను సందర్శించారు.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెంటర్ పనులు త్వరితగతిన పూర్తి చేసి బర్త్ కంట్రోల్ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.కలెక్టర్ వెంట ఆర్డీవో మధుసుధన్, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, పంచాయతీ సెక్రటరీ, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media