Thursday, 09 April 2026 05:36:43 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

బ్యాంకులను విజిట్ చేసిన కలెక్టర్...

Date : 24 July 2024 11:53 PM

Telugu Rekha Media - తెలంగాణ / సిద్ధిపేట : సిద్దిపేట పట్టణంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్దిపేట బ్రాంచ్ మరియు ఎస్బిఐ వ్యవసాయ మరియు వాణిజ్యశాఖ బ్రాంచ్ లను విజిట్ చేసిన జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి రైతు రుణమాఫీ మరియు పంట రుణాల రీ షెడ్యూల్ ను పరిశీలించారు.రోజుకు ఎంతమందికి పంట రుణాల రీషెడ్యూల్ చేస్తున్నారు మరియు పంట రుణ మాఫీలో ఎక్కడైనా సమస్య ఉందా. ఉంటే ఎలా పరిష్కరిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేస్తున్నారా అని బ్యాంక్కర్లను అడిగి తెలుసుకున్నారు. బ్యాంకులకు పంట రుణాల రీ షెడ్యూల్ కోసం వచ్చిన రైతులతో మాట్లాడి రుణమాఫీ మరియు పంట రుణాల మంజూరు గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఆర్థికంగా చేతనందించి వ్యవసాయ రంగంలో మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీ కార్యక్రమం తీసుకువచ్చిందని, లక్ష రూపాయల లోపు విడుదలైన రైతు రుణమాఫీ ప్రక్రియను వెంటనే పూర్తి చేసి ఈనెల నెలాఖరులోగా ఆయా రైతులకు కొత్త రుణాలను అందించాలని అన్నారు. అదేవిధంగా లక్షా లోపు పంట రుణం ఉండి మాఫీ కానీ రైతుల ఫిర్యాదుల స్వీకరించేందుకు ప్రతి బ్యాంకులో ఏర్పాటు చేసిన ఎంక్వైరీ సెంటర్లో అవసరమైతే అదనంగా మరో కౌంటర్ ను ఏర్పాటు చేసి వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో పరిష్కరించాలని అన్నారు. ప్రతి బ్యాంకులో ప్రతిరోజు 100 రుణాల రెన్యువల్ చేయాలని ఎల్డీఎం హరిబాబును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ వికాస్, మేనేజర్ సురేష్, ఎస్బిఐ చీఫ్ మేనేజర్ జయంత్, మేనేజర్ సుధీర్ ఆయా బ్యాంకుల సిబ్బంది తదితరులు ఉన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :