Wednesday, 15 April 2026 03:26:32 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలి

-- జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

Date : 13 June 2024 08:30 PM

Telugu Rekha Media - తెలంగాణ / జగిత్యాల్ : విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకొని విద్యాభ్యాసం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.గురువారం జిల్లాలోని కొడిమ్యాల, మల్యాల మండల కేంద్రాలలో జరిగిన బడి బాట కార్యక్రమంలో భాగంగా ఏకరూప దుస్తులు, పాఠ్య, నోటు పుస్తకాలను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా సాధికారత భాగంగా అమ్మ ఆదర్శ కమిటీలకు పాఠశాలల్లో కనీస మాలిక సదుపాయాలు, విద్యుత్, త్రాగునీరు, పెద్ద, చిన్న మరమ్మత్తుల పనులను కమిటీలకు అప్పగించడం ముఖ్యమంత్రి ఆలోచనా విధానంలు అనుగుణంగా జరిగిందని తెలిపారు. ఆయా పనులను కమిటీలు పర్యవేక్షించాలని అన్నారు. మహిళల భాగస్వామ్యంతో అప్పగించిన పనులు సక్రమంగా చేస్తాయని తెలిపారు. అందుకు నిదర్శనం కేవలం 20 రోజుల్లోనే మహిళా సంఘాల సభ్యులు పాఠశాలల పిల్లలకు యూనిఫాం లు కుట్టించడం జరిగిందని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 591 పాఠశాలల్లో రు. 43.45 కోట్లతో పనులు చేపట్టడం జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతీ విద్యార్థి పై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతున్నదని, సర్కారు బడుల్లో క్వాలిఫైడ్ ఉపాద్యాయులు పనిచేస్తున్నారని , భావితరాలకు అవసరమైన విద్యా బోధన చేయడం జరుగుతున్నదని తెలిపారు. అవసరం మేరకు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుచేయడం జరుగుతున్నదని తెలిపారు. దేవుడి తరువాత తలరాత మార్చే శక్తి కేవలం ఉపాధ్యాయులపై వుందని తెలిపారు. వంద శాతం ప్రగతి సాధించే విధంగా విద్యా బోధనకు కృషి చేయాలని అన్నారు. అనంతరం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉందని, ఉపాద్యాయులు నాణ్యమైన బోధన చేసి విద్యార్థులను మంచి పౌరులుగా, ఉత్తములుగా తీర్చిదిద్దాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 2 వేల కోట్లు నిధులను కేటాయించారని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం లో మొదటి స్థానంలో జిల్లాను నెలకొల్పాలని అన్నారు. స్వంత ప్పిల్లల్లాగ విద్యార్థులను చూసుకోవాలని అన్నారు. చొప్పదండి నియోజక వర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దాలని, ఉపాద్యాయులు సక్రమంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. కార్యక్రమం మొదట్లో రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, డీఆర్డీవో సంపత్ రావు,డీపీవో దేవరాజ్,డీఉవో జగన్ మోహన్ రెడ్డి, మండలాల ప్రజా ప్రతినిధులు, పాఠశాలల ఉపాద్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాలలో కమిటీలు, స్వయం సహాయక బృందాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :