Wednesday, 29 July 2026 03:48:38 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

జిల్లాలో గంజాయి తాగేవారు తస్మాత్ జాగ్రత్త...

జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లకు గంజాయి కిట్లు అందుబాటులోకి. -- జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

Date : 26 July 2024 10:39 PM

Telugu Rekha Media - తెలంగాణ / రాజన్న సిరిసిల్ల : గంజాయి తాగే వారిని పట్టుకునేందుకు జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లకి గంజాయి టెస్ట్ కిట్లు అందుబాటులోకి వచ్చాయని ప్రతి పోలీస్ స్టేషన్ లలో రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే గంజాయి టెస్ట్ నిర్వహించి వాటికి బానిసై తాగే వారిని పట్టుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ, సిరిసిల్ల టౌన్ సిఐ లతో కలసి గంజాయి కిట్ల ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ జిల్లాలో గంజాయి కిట్ల సహాయంతో పరీక్షలు నిర్వహించి గంజాయి సేవించినవారు మరియు వారికి సరఫరా చేసిన 8 మందిపై కేసులు నమోదు చేసి 390 గ్రాముల గంజాయి, 5 గంజాయి సిగరెట్లు స్వాధీనం చేయడం జరిగిందని, గంజాయికి అలవాటు పడి తాగేవారు తస్మాత్ జాగ్రత్తగా ఉండలని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి రహిత జిల్లాగా మార్చడాని జిల్లా పోలీస్ విన్నూత కార్యక్రమలు చేపడుతూ ప్రజల్లో అవగాహన కల్పింస్తుదని, జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్ లు, నార్కోటిక్ జగిలాలతో తనిఖీలు చేపడుతూ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపడం జరుగుతుదన్నారు. గంజాయి మత్తు పదార్థాలను అక్రమ రవాణాకు చెక్ పెడుతూ గంజాయిని పట్టుకుంటున్నారే గాని వాటిని సేవించే వారిని గుర్తించడం కష్టంగా మారిందని,ఈ నేపధ్యంలో తెలంగాణ పోలీస్ గంజాయి తాగే వారిని గుర్తించడానికి అన్ని పోలీస్ స్టేషన్లలోకి గంజాయి టెస్ట్ కిట్లు అందుబాటులోకి తీసుకవచ్చాయని డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే,గంజాయి టెస్ట్ లు నిర్వహించి వాటికి బానిసైన వారిని పట్టుకోవడం జరుగుతుదన్నారు.జిల్లాలో గంజాయి సేవించేవారు ఇకనుంచి పోలీసుల చేతిలో తప్పించుకోలేరని హెచ్చరించారు. జిల్లాలో గంజాయి కిట్ల సహాయంతో గతంలో గంజాయి కేసులల్లో నిందుతులుగా ఉన్న వారు వారి ప్రవర్తనలో మార్పు వచ్చిందా లేదా అనే నేపధ్యంలో,అనుమాస్పదంగా తిరుగుతు కనపడిన వారిని సిరిసిల్ల, ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట్, గంభీరవుపేట్ పోలీస్ స్టేషన్లలో గంజాయి కిట్స్ తో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చిన వారిని మరియు వారికి గంజాయి సరఫరా చేసిన వారిని 08 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద 390 గ్రాముల గంజాయి,05 గంజాయి సిగరెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: