Telugu Rekha Media - తెలంగాణ / హన్మకొండ : సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ భవనం లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యా రాణితో కలిసి, కలెక్టర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ప్రజలు ఇచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను మానవతా దృక్పథంతో సకాలంలో పరిష్కరించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. నేటి ప్రజావాణిలో జిల్లా వ్యాప్తంగా మొత్తం (124) దరఖాస్తులు రాగా అందులో అత్యధికంగా జిల్లా రెవెన్యూ శాఖకు సంబంధించి 84, ఉపాధి శాఖ 10, మహానగర పాలక సంస్థ 04, షెడ్యూల్డు కులాల శాఖ 03, DBCDO (MJBC) 03, నీటి పారుదల శాఖ 02, జిల్లా పంచాయతీ శాఖ 02, వైద్య ఆరోగ్య శాఖ 02, జిల్లా వ్యవసాయ శాఖ 02, పోలీస్ శాఖ 03, మరియు ప్రాంతీయ సహకార సంస్థ, లీడ్ బ్యాంక్, పౌర సరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ, నర్సంపేట మునిసిపాలిటీ, గిరిజన అభివృద్ధి, రోడ్లు మరియు భవనాల శాఖ, ఎం జి ఎం, జిల్లా విద్యా శాఖ, మరియు జిల్లా గ్రామీణ అభవృద్ధి శాఖలకు చెందినవి ఉన్నాయని. ఆయా దరఖాస్తులను సంబంధిత శాఖ అధికారులకు పరిష్కరణ నిమిత్తం సిఫారసు చేశారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులకు చేరేవిధంగా జిల్లా అధికారులు చొరవ చూపాలని, ప్రజలనుండి వారం వారం స్వీకరించిన ధరకాస్తులలో పరిష్కరించేందుకు వీలుకానీ పక్షంలో దరఖాస్తుదారునికి అందుకు గల కారణాలను స్పష్టంగా తెలియజేస్తూ ప్రజావాణి పోర్టల్ లో పెండింగ్ దరఖాస్తులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ సంబందిత శాఖల జిల్లా అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో కృష్ణ వేణి, జిల్లా పరిషత్ సిఇవో రాం రెడ్డి , డిఆర్డీఓ కౌసల్యాదేవి, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media