Saturday, 13 June 2026 08:31:36 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

పూరీ తీరానికి 40 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం...

-- తెలంగాణలో అతి భారీ వర్షాలు.

Date : 20 July 2024 11:06 PM

Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం తీరం వైపుకు కదులుతోంది. పూరీ తీరానికి 40 కిలో మీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఒడిశా-ఛత్తీస్‌గఢ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతి పెరుగుతూ వస్తోంది.తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాణహిత నది వరద ప్రమాద స్థాయిని దాటి ప్రవాహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గోదావరి వద్ద నీటమట్టం 30.5 అడుగులకు చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. చర్లలోని తాలిపేరు ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి 66900 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 18,275 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. శ్రీరాంసాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులుకాగా ప్రస్తుతం 1066 అడుగుల వరకు నీరు చేరింది.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :