Wednesday, 29 July 2026 03:47:00 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

కోదాడలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు...

Date : 24 July 2024 11:14 PM

Telugu Rekha Media - తెలంగాణ / సూర్యాపేట్ : బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు కోదాడలో ఘనంగా నిర్వహించారు. బుధవారం పట్టణ సమీపాన దుర్గాపురం లో గల మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బొల్లం మల్లయ్య యాదవ్ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన యువ నాయకుడు కేటీఆర్ 10 సంవత్సరాలలోనే రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపి హైదరాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని తెలంగాణ ప్రజల ఆశీస్సులతో భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులు చేపట్టి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. త్వరలోనే రాష్ట్ర రథసారధి కావాలని కోరుకుంటూ కోదాడ నియోజకవర్గ ప్రజల తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కుక్కడపు.బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చింతా. కవితా రాధారెడ్డి,బిఆర్ఎస్ పార్టీ, ముస్లిం మైనార్టీ, కార్మిక విభాగం నాయకులు షేక్.నయీమ్, మామిడి.రామారావు, కర్ల. సుందర్ బాబు, ముత్తవరపు. రమేష్, సాదిక్, సైదులు, నల్ల. భూపాల్ రెడ్డి, మాదాల. ఉపేందర్, షాకీర్, అబ్బూ, అభిదర్ నాయుడు, బాదే. రామారావు ,అంబాల రాంబాబు, కొట్టు ఫష , తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :