Saturday, 13 June 2026 08:17:08 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

హత్యలు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసంతో ఏపీ రివర్స్‌ డైరెక్షన్‌లో వెళ్తోంది...

-- వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆందోళన.

Date : 26 July 2024 10:23 PM

Telugu Rekha Media - తెలంగాణ / అమరావతి : హత్యలు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసంతో ఏపీ రివర్స్‌ డైరెక్షన్‌లో వెళ్తోందని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారే ఉండకూడదనే రీతిలో రాష్ట్రంలో అణచివేత పాలన కనిపిస్తోందని అన్నారు. బాధితులు కేసు పెట్టడానికి వెళ్తే.. వారిపైనే రివర్స్‌ కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. మిథున్‌ రెడ్డి మీద దాడి చేసి ఆయనపైనే కేసులు పెట్టారని మండిపడ్డారు. వినుకొండ హత్యకేసులో టీడీపీ నేతలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని జగన్‌ ప్రశ్నించారు. మదనపల్లి ఫైల్స్‌ అంటూ ఏదేదో ప్రచారం చేస్తున్నారని అన్నారు. వినుకొండ ఘటనను దారి మళ్లించేందుకే మదనపల్లి ఇష్యూ తెచ్చారని విమర్శించారు.డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేయడంలో చంద్రబాబు నాయుడు దిట్ట అని జగన్‌ విమర్శించారు. మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే.. అది కుట్ర అంటూ దుష్ప్రచారం చేశారని అన్నారు. దీనికి పెద్దిరెడ్డికి లింక్‌ పెడుతున్నారని మండిపడ్డారు. ఆర్డీవో ఆఫీసులో ఒకవేళ డాక్యుమెంట్లు కాలిపోతే అవే రికార్డులు ఎమ్మార్వో ఆఫీసులో, కలెక్టర్‌ ఆఫీసుల్లో ఉంటాయని తెలిపారు. అయినా ఏదో జరిగిపోతున్నట్లు దారుణంగా హైడ్రామా చేసి డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేశారని మండిపడ్డారు. మదనపల్లికి హెలికాప్టర్‌ పంపించిన చంద్రబాబు నాయుడు.. ముచ్చుమర్రికి ఎందుకు హెలికాప్టర్‌ పంపించలేదని ప్రశ్నించారు. జగన్‌కు పేరు వస్తుందని దిశ పోలీస్ స్టేషన్లను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వైసీపీ లక్ష్యంగానే పల్నాడులో పోలీసు అధికారులను మార్చారని అన్నారు. న్యాయం, ధర్మం వైపు పోలీసులు నిలబడటం లేదని విమర్శించారు.పిన్నెల్లికి మంచిపేరు ఉంది కాబట్టే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని జగన్‌ అన్నారు. పిన్నెల్లి లాంటి మంచి నాయకుడిపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్‌బుక్‌ పేరుతో సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలోశాంతి భద్రతలు దిగజారడానికి కారణం రెడ్‌బుక్‌ అని ఆరోపించారు. రెడ్‌బుక్‌ను చూపిస్తూ నారా లోకేశ్‌ బెదిరింపులకు దిగారని అన్నారు. రాష్ట్రమంతా హోర్డింగులు పెట్టి ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :