Wednesday, 29 July 2026 02:08:43 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

వీధి కుక్క స్వైర విహారం..పలువురికి గాయాలు...

Date : 02 August 2024 11:03 AM

Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : ఓ వీధి కుక్క స్వైర విహారం చేస్తూ, రోడ్డు పై కనిపించిన ప్రతి ఒక్కరినీ కరుస్తూ వెళ్లిన సంఘటన బాలానగర్ లో చోటు చేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం ఈ రోజు మధ్యాహ్న సమయంలో ఓ వీధి కుక్క మొదటగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ బాలుడి పై దాడి చేసింది. బాలుడిని కుక్క నుండి కాపాడిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అదే కుక్క సాయి నగర్, వినాయక్ నగర్, రాజు కాలనీలలో తిరుగుతూ మొత్తం 16 మందిపై దాడికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. దాడికి గురైన వారిలో ఏడాదిన్నర వయస్సు నుండి 16 ఏళ్ళ వయస్సు చిన్నారులు, బాలురు ఉన్నారు . వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. సంవత్సరం క్రితం ఇదే ప్రాంతంలో ఓ కుక్క 10 మంది పై దాడి చేసిన సంఘటన మరువక ముందే మరో సంఘటన చోటు చేసుకోవటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బెడద నుండి విముక్తి కల్పించాలని కోరుతున్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :