Wednesday, 15 April 2026 03:48:16 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

https://cmrf.telangana.gov.in/ వెబ్‌సైట్‌ ప్రారంభిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

Date : 03 July 2024 06:07 AM

Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను ఇక నుంచి ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. ఇందుకోసం సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఆధ్వర్యంలో రూపొందించిన వెబ్‌సైట్‌ https://cmrf.telangana.gov.in/ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ప్రారంభించారు.

సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహించాలని ముఖ్య‌మంత్రి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఈ నిధులు పక్కదారి పట్టిన నేపథ్యంలో ఈ విధానాన్ని రూపొందించారు. ఇకముందు సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను ఈ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. జులై 15 తర్వాత ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తారు. సీఎంఆర్ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలు తీసుకుని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ సిఫార్సు లేఖను జత చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ లో సంబంధింత దరఖాస్తుదారుడి బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి. అప్‌లోడ్ చేసిన తర్వాత సీఎంఆర్ఎఫ్ కు సంబంధించిన ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్‌ను సంబంధిత ఆస్పత్రులకు పంపించి నిర్ధారించుకుంటారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే సీఎంఆర్ఎఫ్ దరఖాస్తును ఆమోదించిన తర్వాత పక్కదారి పట్టే అవకాశం లేకుండా చెక్ పైన తప్పని సరిగా దరఖాస్తుదారుడి అకౌంట్ నెంబర్‌ను ముద్రిస్తారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :