Saturday, 13 June 2026 06:56:31 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

డ్రగ్స్ మహమ్మారిని నిర్ములిద్దాం...

-- రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

Date : 27 June 2024 09:41 AM

Telugu Rekha Media - తెలంగాణ / రాజన్న సిరిసిల్ల : మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం పురస్కారించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో డ్రగ్-రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రజలు, యువత, విద్యార్థులతో కలసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల మైదానం నుండి అంబేద్కర్ చౌరస్తా, నేతన్న చౌరస్తా గాంధీ మీదుగా మరక కళాశాల గ్రౌండ్ వరకు కొనసాగిన ర్యాలీ, ప్రత్యేక ఆకర్షణగా మాదకద్రవ్యాల నిర్మూలనకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను తెలియజేస్తూ రూపొందించిన ప్లకార్డులు, కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. డ్రగ్స్ నిర్ములనకోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై డ్రగ్స్ మహమ్మరిని నిర్ములించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దాం అని ఎస్పీ పిలుపునిచ్చారు. యువత గంజాయి లాంటి మత్తుపదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, చెడు అలవాట్లకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తు వైపు నడుచుకోవాలని తెలిపారు. సమాజంలో ప్రభుత్వం నిషేధించిన మాదక ద్రవ్యాలు సమూలంగా నిర్మూలించటలో యువత, ప్రజలు పోలీసువారికి సహకరించుటలో కీలక పాత్ర పోషించాలని కోరారు.

యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అలాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి జీవితంలో ఉన్నత విజయాలను చేరుకొని తల్లిదండ్రులకు మంచి పెరు తీసుకరవాలని అన్నారు. జిలాల్లో గంజాయి, డ్రగ్స్ నిర్ములనకు జిల్లాలోని కళాశాలలో, పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులతో యాంటీ డ్రగ్స్ క్లబ్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహన ర్యాలీలు చేపట్టి పెద్దఎత్తున విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. గంజాయి లాంటి మత్తుపదార్థాలకు సంబందించిన సమాచారాన్ని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో నెంబర్ 8712671111 కి లేదా డయల్100 లేదా మీ పరిధిలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుదన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ లు రఘుపతి, మాధుకర్, ప్రవీణ్ కుమార్, ఆర్ఐ లు యాదగిరి, మాధుకర్, రమేష్,జిల్లా మహిళ శిశు సంక్షేమ అధికారి లక్ష్మీరాజాం, జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ ,పోలీస్ సిబ్బంది, పలు పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు , విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :