Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రం లోని ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి ఆద్వర్యం లో వందలాది మంది మహిళలు కోటి లోని ఆరోగ్య విభాగం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.ఒక సందర్బం లో మహిళలు ఆరోగ్య విభాగం లోకి చొచ్చుకొని వెళ్ళే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అడ్డుకున్నారు దీనితో అక్కడ ఉద్రిక్తత పరిస్తితి న్నేలకోంది. ఈ సందర్బంగా డాక్టర్ శిల్పారెడ్డి మాట్లాడుతూ ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వారికి ప్రతి నెల జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేసారు. అనంతరం జాయింట్ డైరక్టర్ పద్మజను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా జాయింట్ డైరక్టర్ పద్మజ మాట్లాడుతూ ఆశ వర్కర్లకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు శిల్పారెడ్డి తెలిపారు.
Reporter
Telugu Rekha Media