Telugu Rekha Media - తెలంగాణ / సికింద్రాబాద్ : సికింద్రాబాద్ లోని ఆల్ఫా హోటల్, సందర్షిని హోటల్, రాజ్ బార్ అండ్ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేసారు. చాలా కాలంగా ఫ్రిడ్జ్ లోనే నిల్వ ఉంచిన మటన్ మాంసాహార ముడి పదార్థాలను గుర్తించారు. ఆల్ఫా బ్రాండ్ ఐస్ క్రీమ్, బ్రెడ్ ప్యాకెట్లపై డేట్ లేకుండా కస్టమర్లకు విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆల్ఫా హోటల్ పై కేసు నమోదు చేసారు. రాజ్ బార్ అండ్ రెస్టారెంట్ కిచెన్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. రాజ్ బార్ అండ్ రెస్టారెంట్ సిథటిక్ ఫుడ్ కలర్స్ ఉపయోగిస్తున్నారు. ఎప్ఎస్ఎస్ఏఐ సర్టిఫికెట్ వ్యాలిడిటీ ముగిసినట్లు గుర్తించారు.
Reporter
Telugu Rekha Media