Telugu Rekha Media - తెలంగాణ / జగిత్యాల్ : పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి, పారిశుధ్యం పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదేశించారు. గురువారం జగిత్యాల కేంద్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి -లక్ష్మణ్ తో కలసి ఆకస్మిక తనిఖీ చేశారు..పురపాలిక పరిధిలో నిర్మించనున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. పట్టణ ప్రగతి నేపథ్యంలో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో ముందుండాలని పేర్కొన్నారు.పట్టణ అభివృద్ధికి అధికారులు సమిష్టి తో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో పారిశుద్ధ్యం మెరుగు పరిచే దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.పట్టణ పారిశుద్ధ్య, అభివృద్ధి, గ్రీనరీ పనులపై కలెక్టర్ తో మున్సిపల్ చైర్‌పర్సన్ మాట్లాడారు.సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు.
Reporter
Telugu Rekha Media