Saturday, 13 June 2026 08:18:17 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

కువైట్ అగ్ని ప్రమాదంలో మృత్యుంజయులు..?

-- మొదటి అంతస్తు నుంచి లుంగీల సాయంతో ఇద్దరు, కేబుల్ వైరు సహాయంతో ఒకరు కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు.

Date : 15 June 2024 02:04 PM

Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : జూన్ 12న తెల్లవారు జామున కువైట్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలను దక్కించుకుని ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిర్యాల జిల్లాకు చెందిన కొట్టె గంగయ్య, రాజన్న సిరిసిల్ల జిల్లా నెరేళ్ల, మెదక్ జిల్లా దుబ్బాక కు చెందిన ఇద్దరు వ్యక్తులు మొదటి అంతస్తు నుంచి లుంగీల సాయంతో కిందకు దిగారు. ఆసుపత్రిలో వారికి ప్రాథమిక చికిత్స అందించి పంపించారు.

మంచిర్యాల జిల్లా లక్షెటిపేట మండలం పాత కొమ్ముగూడెం గ్రామానికి చెందిన కొట్టె గంగయ్య కువైట్ లోని హైవే సూపర్ మార్కెట్ లో గత పన్నెండు ఏళ్లుగా హెల్పర్ గా పనిచేస్తున్నాడు. సూపర్ మార్కెట్ యాజమాన్యం తన సిబ్బంది కోసం కువైట్ లోని మంగాఫ్ ప్రాంతంలో ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ లో వసతి సౌకర్యం లేబర్ అకామడేషన్, ఏర్పాటు చేసింది. రెండవ అంతస్తులో ఒక రూములో గంగయ్యతో పాటు మరో తెలుగు వ్యక్తి, ఇద్దరు కేరళ వాళ్ళు ఉంటారు. డ్యూటీకి వెళ్లాల్సిన ఒక కేరళ అతను ఉదయాన్నే నిద్రలేసి స్నానం చేసి వచ్చి 4.15 ని.లకు చేసిన అరుపులు విన్న మిగతా ముగ్గురు ఘాడ నిద్ర నుంచి లేచారు. గది బయటకు వచ్చి చూడగా దట్టమైన పొగ, చిమ్మ చీకటి. గంగయ్య రూమ్మేట్స్ ముగ్గురు రెండవ అంతస్తు నుంచి కిందికి దూకారు. వాళ్ళ కాళ్ళు విరిగాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండవ అంతస్తు నుంచి కిందికి దూకడానికి ధైర్యం చాలని గంగయ్య తన మొబైల్ ఫోన్ లోని టార్చ్ లైట్ వెలుగులో పరిసరాలను గమనించాడు. దట్టమైన పొగ వలన కళ్ళు మండినా, చిమ్మ చీకటిలో గోడను పట్టుకుని మెల్ల మెల్లగా కిటికీ వద్దకు వెళ్లి కేబుల్ వైరు సహాయంతో కింది అంతస్తు లోని రేకులపై దూకాడు. పక్క బిల్డింగ్ వాళ్ళు వేసిన నిచ్చెన సాయంతో కిందికి దిగాడు. ఆసుపత్రిలో చేరిన గంగయ్యకు స్కానింగ్, ఎక్స్-రే తదితర పరీక్షలు చేసి వైద్యం అందిస్తున్నారు. శరీరానికి అక్కడక్కడ చిన్న గాయాలయ్యాయి. టెన్షన్ లో గుండె వేగంగా కొట్టుకోవడం, బీపీ పెరగడం లాంటివి జరిగాయి. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :